Dhurandhar 2 Interesting Update:’గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీకి సరైన సక్సెస్ దక్కడం లేదంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలోని హీరోలందరూ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు రన్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘దురంధర్’ సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టే సినిమా అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి దక్కింది. దాంతో ఇప్పుడు ‘దురంధర్ 2’ సినిమా మీద ప్రతి ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఇండస్ట్రీ సైతం ఈ సినిమాతో ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. ఇక మార్చి 19, 2026వ తేదీన దురంధర్ 2 సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలైతే చేశారు. కానీ ఇప్పుడు మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అయింది. కాబట్టి ఈ సినిమాలోని కథని కొంత మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తోంది.
నిజానికి ఇప్పటికే దురుంధర్ సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది.
కానీ ఈ సినిమాలో రెహమాన్ డకౌత్ క్యారెక్టర్ లో నటించిన అక్షయ్ కన్నా కు మంచి గుర్తింపైతే వచ్చింది. ఇక మొదటి పార్ట్ ఎండింగ్ లో రెహమాన్ పాత్ర చనిపోవడంతో సెకండ్ పార్ట్ లో మనకు అక్షయ్ కన్నా కనిపించడు.
కాబట్టి ఈ సినిమా మీద కొంతవరకు ప్రేక్షకులకు అంచనాలు తగ్గే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ విషయాన్ని గమనించిన డైరెక్టర్ ఆదిత్య ధర్ ఇప్పుడు ఎలాగైనా సరే అక్షయ్ ఖన్నా ను ఈ సినిమాలో భాగం చేయాలని చూస్తున్నాడట. దానికోసం కథలో కొన్ని మార్పులు చేసి మరి మళ్ళీ రీ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
మొదటి పార్ట్ లో చనిపోయిన రెహమాన్ ను ఎలా తీసుకొస్తారు అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది… రెహమాన్ బ్యాక్ స్టోరీ చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదంటే ఏదైనా స్టోరీని ఇంక్లూడ్ చేసి మధ్య మధ్యలో ఫ్లాష్ బ్యాక్ లాగా అతని పాత్రని చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది…ఇక అక్షయ్ ఖన్నా ‘దురంధర్ 2’ సినిమాలో ఉన్నాడనే న్యూస్ ప్రతి ఒక్కరిలో అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడనే చెప్పాలి…