Dhurandhar 2 box office collections: భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ సినిమాకు వచ్చినంత ఓపెనింగ్ వసూళ్లు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు ఏ చిత్రానికి కూడా రాలేదు. అంతే కాకుండా మొదటి వారం లోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా జోరు మామూలు రేంజ్ లో లేదు, రాబోయే రోజుల్లో 2000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి , కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుందని అనుకున్నారు ట్రేడ్ పండితులు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సోమవారం రోజున ఈ చిత్రం వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి.
గత 11 రోజులుగా నాన్ స్టాప్ గా 100 కోట్ల రూపాయలకు తగ్గకుండా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఇప్పుడు 12 వ రోజున ఏకంగా 70 శాతం వసూళ్లు డ్రాప్ అయ్యాయి. విచిత్రం ఏమిటంటే ‘ధురంధర్ ‘ చిత్రానికి రెండవ సోమవారం 29 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టగా, ‘ధురంధర్ 2 ‘ చిత్రం కేవలం 20 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. గ్రాస్ వసూళ్లు 23 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. బాషల వారీగా ఈ చిత్రం ఇండియా లో 12 వ రోజున ఎంత వసూళ్లు రాబట్టిందో వివరంగా చూద్దాం. హిందీ నుండి 23.18కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , తెలుగు వెర్షన్ నుండి 1 కోటి 35 లక్షలు, తమిళ వెర్షన్ నుండి 50 లక్షలు, కన్నడ వెర్షన్ నుండి 23 లక్షలు , మలయాళం వెర్షన్ నుండి 10 లక్షలు రాబట్టింది. ఓవరాల్ ఇండియా వైడ్ 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు 25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
Also Read: చిరంజీవి ఆ మూవీ పేరు చెబితే భయపడుతున్నాడా…
అదే విధంగా ఓవర్సీస్ నుండి 7 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టగా , ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 37 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు వచ్చాయి. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ చిత్రానికి 1430 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పుష్ప 2 , బాహుబలి 2 లను ఈ చిత్రం క్లోజింగ్ లో దాటే అవకాశాలు ఉన్నాయి కానీ, దంగల్ ని దాటడం కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే IPL సీజన్ మొదలైంది. ఆ ప్రభావం చాలా బలంగా పడనుంది. చూడాలి మరి ఎంత వరకు ఈ సినిమా రన్ ఉంటుంది అనేది.