Dhurandhar 2 controversy: డిసెంబర్ నెల నుండి మన ఇండియా లో ‘ధురంధర్’ మేనియా ఏ రేంజ్ లో కొనసాగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూశారు . రీసెంట్ గా విడుదలైన ‘ధురంధర్ 2’ అయితే మూడు వారాల్లో దాదాపుగా 1700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. త్వరలోనే 1800 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని కూడా అందుకోబోతుంది ఈ చిత్రం. ఇకపోతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు డైరెక్టర్ ఆదిత్య డర్ . జియో సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణం లో ఒక భాగమే. అయితే ఇప్పుడు వీళ్ళు చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. మేకర్స్ పై కోర్టు లో కాపీ రైట్స్ కేసు నమోదైంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రం లోని ‘హమ్ ప్యార్ కర్నే వాలా’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతీ మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్ లో ఈ పాట ట్రెండ్ అవుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో అయితే ఈ పాటపై లక్షల సంఖ్యలో ప్రతీ రోజు రీల్స్ అప్లోడ్ అవుతున్నాయి. అయితే ఈ పాట ఒరిజినల్ సాంగ్ కాదు. 1989 వ సంవత్సరం లో విడుదలైన త్రివేద్ చిత్రంలోని పాట ఇది. దానిని రీమిక్స్ చేసి నేటి తరం యూత్ ఆడియన్స్ నచ్చేలా మార్చి రిలీజ్ చేశారు. అయితే ఈ విషయం పై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసిన త్రిమూర్తి ఫిలిమ్స్ సంస్థ కోర్టు లో కాపీ రైట్స్ కేసు వేసింది . ఈ సాంగ్ కి సంబంధించిన పూర్తి హక్కులు మా వద్దనే ఉన్నాయని ధురంధర్ మేకర్స్ మా నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా, ఈ పాటని తమ సినిమాలో ఉపయోగించుకున్నారని చెప్పుకొచ్చారు.
కేవలం ఆ ఒక్క పాట మాత్రమే కాదు , అదే చిత్రం లోని ‘ఓయ్ ఓయ్’ పాటని కూడా రీమిక్స్ చేశారు. ఈ కేసుని స్వీకరించిన కోర్టు, డైరెక్టర్ ఆదిత్య డర్, బి62 స్టూడియోస్ ని సమాధానం ఇవ్వాలని కోరింది. లేని పక్షం లో తక్షణమే తప్పు ని ఒప్పుకొని నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ee చిత్రం పై ఒక కేసు నమోదు అయ్యింది. ఈ సినిమా స్టోరీ నాదే అంటూ సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఆరోపించిన సంగతి అందరికీ తెలిసిందే.. ఇంతలోపే ఇప్పుడు ఈ కొత్త సమస్యలో ఇరుక్కోవడం చూస్తుంటే , రాబోయే రోజుల్లో ఈ చిత్రానికి కష్టాలు తప్పేలా లేవు .