వారసుడి ప్రేమ కథలు.. హీరోయిన్ కి వరుస ఛాన్స్ లు !

చూస్తుండగానే కొత్త జనరేషన్ హీరోలు వచ్చేశారు. అయితే తమిళ ఇండస్ట్రీకి వస్తే.. వచ్చిన స్టార్ హీరో వారసుల్లో కాస్త క్రేజ్ ను క్రియేట్ చేసుకోగలిగింది మాత్రం చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’నే. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు, యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మొదటి సినిమాతోనే నిరూపించుకున్నాడు. పైగా మనోడికి యూత్ లో ఫుల్ పాపులారిటీ కూడా వచ్చింది. దానికితోడు యాక్టింగ్ లో కూడా మ్యాటర్ ఉండటంతో.. ఫ్యూచర్ […]

Written By: admin, Updated On : April 10, 2021 6:10 pm
Follow us on


చూస్తుండగానే కొత్త జనరేషన్ హీరోలు వచ్చేశారు. అయితే తమిళ ఇండస్ట్రీకి వస్తే.. వచ్చిన స్టార్ హీరో వారసుల్లో కాస్త క్రేజ్ ను క్రియేట్ చేసుకోగలిగింది మాత్రం చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’నే. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రాడు, యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మొదటి సినిమాతోనే నిరూపించుకున్నాడు. పైగా మనోడికి యూత్ లో ఫుల్ పాపులారిటీ కూడా వచ్చింది.

దానికితోడు యాక్టింగ్ లో కూడా మ్యాటర్ ఉండటంతో.. ఫ్యూచర్ స్టార్ హీరోల్లో ఒకడిగా ఈ కుర్రాడు నిలబడే ఛాన్స్ ఉందని.. మణిరత్నం లాంటి డైరెక్టరే ఓ ఇంటర్వ్యూలో స్టేట్ మెంట్ ఇచ్చాడు అంటేనే.. విక్రమ్ తనయుడి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అర్ధం అవుతుంది. అందుకే ఈ కుర్రాడి చుట్టూ నిర్మాతలు తిగుతున్నారట, గతంలో విక్రమ్ తో సినిమాలు చేసిన నిర్మాతలు, అలాగే సినిమాలు చేయాలని ఆశ పడిన నిర్మాతలు ఇలా దాదాపు ఆరుగురు నిర్మాతలు ఈ కుర్రాడికి అడ్వాన్స్ లు ఇచ్చారు.

ఇక ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను కూడా లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో, తన తరువాత సినిమాని మురగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ తో ప్లాన్ చేసుకున్నాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ కుర్రాడి పై ఒక బ్యాడ్ రూమర్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఇంకా పాతికేళ్ళు కూడా నిండిన ఈ కుర్రాడు ఇద్దరు హీరోయిన్స్ తో ఎఫైర్ నడుపుతున్నాడని.. వాళ్లలో ఒక మోడల్ తో పాటు సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ కూడా ఒకటి అని అంటున్నారు.

సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించిన ఈ యంగ్ బ్యూటీ తన తరువాత సినిమాలో ఛాన్స్ ఇప్పించాడట ధృవ్. పైగా ఆ తరువాత సినిమాలో కూడా ప్రియానే హీరోయిన్ గా పెట్టుకోమని దర్శకనిర్మాతల పై ఒత్తిడి తెస్తున్నాడట. మరి ధృవ్ ఇలాగే హీరోయిన్ల విషయంలో తొందరపడితే అసలుకే మోసం వస్తుంది అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ కుర్రాడు కొత్త హెయిర్ స్టైల్ తో పాటు షార్ప్ లుక్ కోసం తన ఫామ్ హౌస్ లో ఏకాంతంగా కసరత్తులు చేస్తుకుంటున్నాడు.