Homeఎంటర్టైన్మెంట్Puneeth Rajkumar: తండ్రి మృతదేహాన్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న... ధృతి పునీత్ రాజ్...

Puneeth Rajkumar: తండ్రి మృతదేహాన్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న… ధృతి పునీత్ రాజ్ కుమార్

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్‌ కు గురవుతుంది. పునీత్ అకాల మరణం లక్షలాది మంది అభిమానులు హృదయాలను బద్దలు చేసింది అని చెప్పాలి. ప్రస్తుతం కంఠీరవ స్టూడియోలో పునీత్ భౌతికకాయాన్ని ఉంచగా, ఈరోజు జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. కాగా తాజాగా ఆయన పార్ధివ దేహానికి పునీతి కుమార్తె ధృతి పునీత్ రాజ్ కుమార్ నివాళులు అర్పించారు.

dhruthi raj kumar pays last tributes to her father puneeth raj kumar

తండ్రి మృతదేహం వద్ద … తన తండ్రి ఇక ఎప్పటికీ తిరిగిరాడు అనే చేదు నిజాన్ని భరించలేక ఆమె కన్నీటి పర్యంతం అవుతుంది. ఆమెతో పాటు పునీత్ రాజ్ కుమార్ అన్న శివరాజ్ కుమార్ కూడా పునీత్ భౌతిక కాయాన్ని చూస్తూ ఏడుస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కర్ణాటక రాజధాని బెంగుళూరు కంఠీరవ స్టేడియానికి ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు కూడా వచ్చి పునీత్ రాజ్ కుమార్ కి నివాళులు అర్పించడం గమనించవచ్చు.

Puneeth Rajkumar's Daughter Cries At Seeing Her Father's Mortal Remains NTV

పునీత్‌ రాజ్ కుమార్‌ భౌతిక ఖాయాన్ని ఇప్పటి వరకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు నందమూరి బాలకృష్ణ, రానా , ఎన్టీఆర్, మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ నివాళులు అర్పించారు. హీరో శ్రీకాంత్‌, ఆలీ కూడా పునీత్‌ కు నివాళులు అర్పించారు. కాగా ప్రభుత్వ లాంఛనలతో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version