Hari Hara Veeramallu : ‘హరి హర వీరమల్లు'(Hari Hara VeeraMallu) సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు బాగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు పూర్తి చేసుకొని వచ్చే నెల 12న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన కంటెంట్ కి పర్వాలేదు అనే రేంజ్ అనిపించింది కానీ, ఈరోజు విడుదలైన పాట మాత్రం అభిమానులను మెంటలెక్కిపోయేలా చేసింది. గోశాల రాంబాబు లిరిక్స్ అందించిన ఈ పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశం సమయంలో బ్యాక్ గ్రౌండ్ గా ఈ పాట రన్ అవుతుంది. ముఖ్యంగా ఈ పాటలోని విజువల్స్ ఫ్యాన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.
Also Read : బయ్యర్స్ ని భయపెట్టి పంపిస్తున్న ‘హరి హర వీరమల్లు’ నిర్మాత..ఇలా అయితే కష్టమే!
లిరిక్స్ అందరికీ అర్థం అయ్యేలా ఉండవు కానీ, కీరవాణి మాత్రం మ్యూజిక్ పరంగా వేరే లెవెల్ డ్యూటీ చేసాడు అని చెప్పొచ్చు. పాటలోని ‘ధిమితి..ధిమితి..ధిమితి’ అంటూ వచ్చే రీ రికార్డింగ్ కి థియేటర్స్ లో దొమ్మలు అదిరిపోవడం గ్యారంటీ అని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ అంటున్నారు. గత రెండు పాటల ద్వారా రాని పాజిటివ్ బజ్ మొత్తం ఈ ఒక్క పాట తో వచ్చిందని, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) విశ్వరూపం చూస్తారని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. సినిమా ఎలా ఉన్న పవన్ కళ్యాణ్ అనే పేరు మీద భారీ ఓపెనింగ్స్ వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మూవీ లవర్స్ ని ఆకర్షించేలా కనీసం ఒక్క కంటెంట్ అయినా వస్తే బాగుంటుంది అని అభిమానులు చాలా కోరుకున్నారు. ఆ కంటెంట్ ఈ పాట ద్వారా రావడంతో అభిమానులు ఈ చిత్రం పై అంచనాలు ఇంకా పెంచేసుకున్నాడు.
క్లైమాక్స్ లో వచ్చే పోరాట సన్నివేశం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసి తెరకెక్కించాడని ఆ చిత్ర దర్శకులలో ఒకరైన జ్యోతి కృష్ణ నేడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ఈ క్లైమాక్స్ తర్వాత 8 నిమిషాల క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశం ఉంటుందట. ఈ సన్నివేశం లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ కి మైండ్ బ్లాస్ట్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. బాహుబలి, కల్కి తర్వాత మన టాలీవుడ్ లో బెస్ట్ క్లిఫ్ హ్యాంగర్ సన్నివేశాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఈ సన్నివేశం ఉంటుందని అంటున్నారు. ఇవన్నీ విన్న తర్వాత అభిమానులు జూన్ 12 వరకు ఆగలేకపోతున్నామని, థియేటర్స్ లో ఈ సన్నివేశాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఆ రేంజ్ లో సినిమా నిజంగానే ఉందా లేదా అనేది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట మేకర్స్.
