Dhee Promo: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో గా ప్రారంభమయి విజయవంతంగా దూసుకెళ్తున్న షో “ఢీ”…. 12 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ (“ఢీ” 13వ సీజన్) గా ప్రేక్షకుల్ని అలరించడానికి వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ని అందించడానికి సిద్దమైంది. కింగ్స్ టీమ్ కి సుడిగాలి సుధీర్ ,హైపర్ ఆది, క్వీన్స్ టీమ్ కి రేష్మి, టిక్ టాక్ స్టార్ దీపికా పిల్లి గ్రూప్ లీడర్స్ గా వ్యవహరిస్తుంటే … జడ్జెస్ గా గణేష్ మాస్టర్ గారు, హీరోయిన్స్ ప్రియమణి, పూర్ణ వ్యవహరిస్తారు. ఈ షో కి ప్రముఖ యాంకర్ “ప్రదీప్ మాచిరాజు” వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
“రోజా సెల్వమణి” పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు రాజకీయపరంగా ఇటు టీవీ షో లతో నిత్యం బిజీ గా గడుపుతూ కుదిరినప్పుడు సినిమాలు చేస్తూ తన షెడ్యూల్ని ఖాళీ లేకుండా ఉంచుకుంటుంది రోజా. ప్రముఖ ఛానెల్ అయిన ఈటీవీ లో రెండు కామెడీ షో లు (జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్) న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.
అయితే మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్వహిస్తున్న ఢీ షో కి చీఫ్ గెస్ట్ గా వచ్చినట్లు తాజా గా విడుదల చేసిన ప్రోమో ని బట్టి చూస్తే అర్ధమవుతుంది. నవంబర్ 17న రోజా పుట్టిన సందర్భం గా ఢీ నిర్వాహకులు రోజా పుట్టిన రోజుని ఢీ సెట్లో ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో డాన్సర్ తేజస్వి రోజా నటించిన సినిమాల్లో నుండి కొన్ని పాటలకి డాన్స్ చేసి డేడికేట్ చేసింది. దానికి రోజా స్పందిస్తూ … జన్మలో ఇటువంటి గిఫ్ట్ ఎవ్వరు ఇవ్వలేరు, థాంక్యూ చాలా బాగా డాన్స్ చేసారు అంటూ ఎమోషనల్ అయ్యింది. స్వతహాగా మంచి డాన్సర్ అయిన రోజా .. కుదిరినప్పుడల్లా షోస్ లలో డాన్స్ వేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉంటుంది.