Dhanush Political Entry: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటు ముందుకు దూసుకెళుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ధనుష్ లాంటి హీరోలు ఇటు తెలుగు, అటు తమిళ్ భాషల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా నటుడిగా గొప్ప గౌరవాన్ని కూడా పొందుతున్నారు. ఇక రీసెంట్ గా ఆయన చేసిన కుబేర (Kubera) సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆయన చాలా హ్యాపీ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రాబోయే సినిమాలతో కూడా భారీ విజయాన్ని అందుకోవాలనే క్రమంలోనే భారీ కసరత్తులను కూడా చేస్తున్నారు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చెబుతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. అయితే ధనుష్ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికి తన అభిమానులను కలిసి వాళ్లతో ముచ్చటించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి ఆదివారం 500 మంది అభిమానులను కలిసి వాళ్లతో ముచ్చటించాలని వాళ్ల అభిప్రాయాలను తెలుసుకొని వారు తన గురించి ఏమనుకుంటున్నారు. తన నుంచి ఎలాంటి సినిమాలను ఆశిస్తున్నారు అనే దాని మీద డిస్కషన్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది… దీని కోసమే సాలి గ్రామంలో ఉన్న ఒక స్టూడియోను బుక్ చేసినట్టుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 25 వారాల పాటు ప్రతి ఆదివారం ఆ స్టూడియో లో అభిమానులను కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నాడు. మరి మొత్తానికైతే ధనుష్ కి రాజకీయ ఎంట్రీ ఇచ్చే ఉద్దేశ్యంతో ఉందని అందువల్లే ఆయన తన ఫాన్స్ తో మీట్ అవుతున్నాడు అంటు కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ లో యాక్షన్ సీన్స్ అన్నీ డూప్ తోనే చేయించారా?
ఎందుకంటే ఇప్పటికే విజయ్ లాంటి స్టార్ హీరో రాజకీయ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆయన కూడా మొదట్లో చర్చలు జరిపిన తర్వాత రాజకీయ ఎంట్రీ ఇచ్చాడు ఇక దీనికంటే ముందే రజనీకాంత్ కమలహాసన్ సైతం అదే బాటలో నడిచారు.
మరి మొత్తానికైతే ఇప్పుడున్న సిచువేషన్ ను బట్టి ధనుష్ రాజకీయ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఆయన మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన స్టార్ హీరో గా పేరు తెచ్చుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు…ఇక ఇతర తమిళ్ హీరోలతో పోలిస్తే ధనుష్ చాలా ముందు వరుసలో ఉన్నాడు…