Dhanush: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ సినిమాలకు ఎక్కువ రీచ్ ఉంటుంది. ఇక అందుకే ప్రతి ఒక్కరు స్టార్ హీరోలుగా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న కుర్ర హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిద్య భరితమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేయగలిగే కెపాసిటి ఉన్న నటుడు ధనుష్… ఆయన తమిళ్ కి మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇండియాలో ఉన్న ఏ దర్శకుడైన వైవిధ్యమైన కథాంశంతో ఒక స్టోరీ రాసుకున్నప్పుడు ఆ కథలకు హీరోగా ధనుష్ ను తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. ఆయన సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచిన కూడా నటన పరంగా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు.
ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. గత సంవత్సరం కుబేర, రాయన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన భారీ విజయాలను సాధించాడు. ఇక ఇప్పుడు కూడా అలాంటి సినిమాలనే చేయాలని చూస్తున్నాడు.
ధనుష్ డేట్స్ ఇప్పుడు ఏ మాత్రం ఖాళీ లేవు అయినప్పటికి పాన్ ఇండియా డైరెక్టర్లందరు అతని వెంటే పడుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వేణు ఉడుగుల లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం ధనుష్ తో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక అతనితో పాటుగా మరి కొంతమంది దర్శకులు సైతం ధనుష్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక వెంకీ అట్లూరి సైతం ధనుష్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం సూర్యతో సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలిపి ఆ తర్వాత ధనుష్ తో మరో సినిమా చేయడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఇక వీళ్ళతో పాటుగా బాలీవుడ్ డైరెక్టర్ అయిన సంజయ్ లీలా బన్సాలీ, రాజకుమార్ హిరానీ లాంటి దర్శకుడు సైతం ధనుష్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…