https://oktelugu.com/

‘ఉప్పెన’ నుండి ధక్ ధక్ ధక్ సాంగ్ రిలీజ్

మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కోటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి పాటగా విడుదల చేసిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది.చాలా రోజుల తరువాత […]

Written By:
  • admin
  • , Updated On : March 10, 2020 / 02:07 PM IST
    Follow us on

    మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఒక్కోటి విడుదల చేస్తున్నారు.

    ఈ క్రమంలో మొదటి పాటగా విడుదల చేసిన నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది.చాలా రోజుల తరువాత దేవిశ్రీ ప్రసాద్‌ మార్క్‌కి తగ్గ సాంగ్ చేసాడనే చెప్పాలి. ఇప్పుడు తాజాగా ఉప్పెన మూవీ బృందం నువ్వూ నేను ఎదురైతే ధక్..ధక్..ధక్.. అనే పాటను రిలీజ్ చేశారు.