Devil Twitter Review: హీరో కళ్యాణ్ రామ్ కెరీర్లో ఫస్ట్ టైం సీక్రెట్ ఏజెంట్ రోల్ చేశారు. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన డెవిల్ డిసెంబర్ 29న వరల్డ్ వైడ్ విడుదలైంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. డెవిల్ మూవీ ప్రీమియర్స్ ముగిశాయి. ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. డెవిల్ మూవీ పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా. బ్రిటీష్ పరిపాలనలో ఏజెంట్ గా పని చేసిన డెవిల్ కథే ఈ చిత్రం.
ఓ అమ్మాయి మర్డర్ వెనుక ఎవరున్నారు? కిల్లర్ ఎవరు? ఎందుకు చంపారు? అనే కారణాలు వెతికేందుకు డెవిల్ ని బ్రిటిష్ ప్రభుత్వం రంగంలోకి దింపుతోంది. డెవిల్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది? ఎదురైన అడ్డంకులు ఏంటి? డెవిల్ అడ్వెంచరస్ జర్నీ ఎలా సాగింది? అనేది కథ. మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం డెవిల్ మూవీ బాగుంది. అయితే కొన్ని ప్లస్ లు, కొన్ని మైనస్ లు ఉన్నాయి.
Done with the show, blended with commercial elements with flat-paced narration. A passable 2nd half with twists and turns, Harsha BGM worked well. Overall it’s below average for me 2.25/5 #Devil
— Peter Reviews (@urstrulyPeter) December 29, 2023
సినిమా ఫస్ట్ హాఫ్ యావరేజ్. సోసోగా సాగుతుంది. ఇంటర్వెల్ సమయానికి ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ పెంచేసింది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్స్ అలరిస్తాయి. క్లైమాక్స్ మరలా రొటీన్ గా ఉంది. మంచి కథ, ఎంచుకున్న పాయింట్ బాగుంది. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. హీరోయిన్ సంయుక్త మీనన్ పాత్ర, నటన బాగున్నాయి.
Lion @NANDAMURIKALYAN annaThop scene in 2nd half mark my words ee scene ki theatre pack avutundi confirm ga congratulations Kalyan anna#BlockbusterDevil#Devil pic.twitter.com/1ZoliY8Ojb
— tarak9999 (@sreedharnaik201) December 29, 2023
ఇక బీజీమ్ పర్లేదు. అక్కడక్కడా మూవీ ల్యాగ్ అయ్యింది. మొత్తంగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చని ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా డెవిల్ చిత్రానికి తమ రివ్యూ ఇచ్చారు. చూస్తుంటే కళ్యాణ్ రామ్ కి హిట్ పడినట్లు ఉంది. అయితే ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. పాజిటివ్ టాక్ నేపథ్యంలో మూవీ ఊపందుకోవచ్చు. వీకెండ్ వరకు సినిమా ఫలితం ఏమిటో తేలిపోతుంది.
DEVIL POSITIVE REPORTS ALL OVER. EXCELLENT 2nd HALF #devil pic.twitter.com/9gBrKr8vID
— SreenuNTR (@Itssreenu9) December 29, 2023
#Devil A Strictly Average Periodic Film that has a mediocre 1st half which tests patience at times but a pretty decent 2nd half with multiple twists. A unique storyline backed by good production values is the biggest plus for the film. Screenplay had potential to be more…
— Venky Reviews (@venkyreviews) December 29, 2023