Devara
Devara : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు’ గారి తర్వాత బాలయ్య బాబు(Balayya Babu) ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో సినిమాలను చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. ముఖ్యంగా మాస్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న బాలయ్య బాబు అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక్కడ నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్నాడు. రీసెంట్ గా దేవర (Devara) సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన మరోసారి దేవర 2 (Devara 2) సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమా క్లైమాక్స్ లో దేవర క్యారెక్టర్ ని చంపింది వర అని చూపించారు. కానీ నిజానికి దేవర క్యారెక్టర్ ని చంపింది వర కాదట. ఇక దేవర క్యారెక్టర్ ని ప్రకాశ రాజ్ చంపుతాడట…అది సస్పెన్స్ గా ఉంచి దేవర కొడుకే అతన్ని చంపాడని సృష్టించి చూపించారట. ఇక ‘బాహుబలి’లో కట్టప్ప కథ చెబుతూ తనే బాహుబలి ని చంపానని చెప్పడం విశేషం.
ఇక ఇక్కడ ప్రకాష్ రాజ్ తనే దేవరని చంపానని చెబితే అచ్చం బాహుబలి సినిమాలాగే ఉంటుందనే ఉద్దేశ్యంతో వరనే దేవర ను చంపినట్టుగా క్రియేట్ చేసి చూపించారట. కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం ప్రకాష్ రాజ్ దేవరని చంపినట్టుగా చూపిస్తారట. ప్రకాష్ రాజ్ దేవర ను ఎందుకు చంపాడు.
ఆయన్ని చంపడం వల్ల ప్రకాష్ రాజ్ కి వచ్చే లాభం ఏంటి అనేది కూడా సెకండ్ పార్ట్ లోనే తెలియజేస్తారట. మరి మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేవర సినిమా ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక దాదాపు 500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరోసారి సీక్వెల్ తో ప్రేక్షకులను పలకరించి భారీ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతుండడం విశేషం…
ఇక ఎన్టీఆర్ సైతం వరుస సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. దాంతోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ (Drogan) అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు దేవర 2 సినిమాకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు…