https://oktelugu.com/

Devara: తమిళనాడు లో మహేష్ ఫ్లాప్ సినిమా వసూళ్లకు దరిదాపుల్లో రాలేకపోయిన ‘దేవర’ చిత్రం!

రజినీకాంత్ 'వెట్టియాన్' చిత్రం విడుదల అవ్వడం వల్ల, ఆ సినిమా ప్రభావం 'దేవర' పై తమిళంలో పడిందని, ఆ సినిమా ప్రభావం వల్లనే బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ ప్రాంతంలో అందుకోలేకపోయింది అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. కానీ వాస్తవానికి 'వెట్టియాన్' చిత్రం కేవలం నాలుగు రోజులు మాత్రమే భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. వీకెండ్ ముగిసిన తర్వాత వసూళ్లు భారీ పడిపోయాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 28, 2024 / 07:00 AM IST

    Devara Collection(1)

    Follow us on

    Devara: తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం ఒక సునామీని సృష్టించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు వెర్షన్ కి దాదాపుగా అన్ని ప్రాంతాలలో వసూళ్లు బాగానే వచ్చాయి. కానీ మిగిలిన భాషలకు సంబంధించిన వసూళ్లు అంతంత మాత్రంగానే వచ్చింది. హిందీ వెర్షన్ లో కూడా కేవలం 45 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. మలయాళం లో అయితే దారుణం, కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా ఆ భాష నుండి రాబట్టలేకపోయింది. ఇక కన్నడం గురించి మాట్లాడుకోవడం వృధా. కనీసం 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అయినా వచ్చాయా అంటే డౌటే. తమిళ వెర్షన్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను కచ్చితంగా రాబట్టాలి. కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా కనీసం 12 కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా రాబట్టలేకపోయింది.

    అయితే రజినీకాంత్ ‘వెట్టియాన్’ చిత్రం విడుదల అవ్వడం వల్ల, ఆ సినిమా ప్రభావం ‘దేవర’ పై తమిళంలో పడిందని, ఆ సినిమా ప్రభావం వల్లనే బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ ప్రాంతంలో అందుకోలేకపోయింది అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. కానీ వాస్తవానికి ‘వెట్టియాన్’ చిత్రం కేవలం నాలుగు రోజులు మాత్రమే భారీ వసూళ్లను సొంతం చేసుకుంది. వీకెండ్ ముగిసిన తర్వాత వసూళ్లు భారీ పడిపోయాయి. కాబట్టి ‘దేవర’ పై ‘వెట్టియాన్’ ప్రభావం పడింది అనేది అవాస్తవం. వాస్తవం ఏమిటంటే తమిళ ఆడియన్స్ తెలుగు సినిమాలను అంత తేలికగా చూడరు. కానీ మహేష్ బాబు, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సినిమాలు మాత్రం బాగా చూస్తారు. ఉదాహరణకి మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘స్పై డర్’ అప్పట్లో భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిన సంగతి తెలిసిందే.

    కానీ ‘స్పైడర్’ చిత్రం ఫ్లాప్ అయ్యినప్పటికీ, తమిళనాడు లో 25 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘దేవర’ అందులో సగం కూడా రాబట్టలేకపోయింది. దీనిని బట్టి మహేష్ బాబు క్రేజ్ తమిళనాడు లో ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రామ్ చరణ్ కి కూడా ఈ ప్రాంతంలో మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘రచ్చ’ అక్కడ ‘రగలై’ అనే పేరు తో దబ్ అయ్యి విడుదలైంది. కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం, ఆరోజుల్లోనే 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను తమిళ వెర్షన్ నుండి రాబట్టింది. ఇక త్వరలో విడుదల అవ్వబోతున్న ‘గేమ్ చేంజర్’ ఎంత మేరకు వసూళ్లను తమిళనాడు నుండి రాబోతుందో చూడడానికి సిద్ధంగా ఉన్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్, ఆయనకీ తమిళనాడు లో రజినీకాంత్ సమానమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి. అయితే ‘గేమ్ చేంజర్’ పై ‘ఇండియన్ 2’ ఫ్లాప్ ప్రభావం పడుతుందో లేదో చూడాలి.