Devara: టాలీవుడ్ లో ఓపెనింగ్స్ కింగ్స్ ఎవరు అంటే మనకి గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు ఎన్టీఆర్. టాక్ తో సంబంధం లేకుండా ఈయన సినిమాలకు వసూళ్లు వస్తుంటాయి. ఒకవేళ సరైన సినిమా పడితే ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు ఉంటాయి. నేడు ‘దేవర’ విషయం లో అదే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్థ రాత్రి నుండే షోస్ మొదలయ్యాయి. కొరటాల శివ సినిమాలకు ప్రారంభంలో నెగటివ్ టాక్ రావడం సర్వసాధారణం. ఎందుకంటే ఆయన సినిమాల్లో స్క్రీన్ ప్లే టేకింగ్ స్టైల్ చాలా స్లోగా ఉంటుంది కాబట్టి అలాంటి టాక్స్ వస్తుంటాయి. ‘దేవర’ కి కూడా ప్రారంభం లో అలాంటి టాక్ వచ్చింది. కానీ సాయంత్రం లోపు టాక్ ఎబోవ్ యావరేజ్ రేంజ్ కి చేరింది. సినిమా సూపర్ హిట్ అయ్యేందుకు ఈమాత్రం చాలు అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
అయితే ఈ సినిమా మొదటి రోజు ఏ హీరోకి కూడా సాధ్యం కానటువంటి రికార్డ్స్ ని నెలకొల్పింది. ముఖ్యంగా బెన్ఫిట్ షోస్ ఈ సినిమాకి పడినంతగా ఏ చిత్రానికి పడదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ సీడెడ్ ప్రాంతం లో చాలా స్ట్రాంగ్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంతంలో ఒక్కొక్క సెంటర్ నుండి వచ్చిన బెన్ఫిట్ షోస్ గ్రాస్ ని చూసి ట్రేడ్ పండితులకు ఫ్యూజులు ఎగిరేంత పని అయ్యింది. కొంతమంది హీరోలకు మొదటి రోజు నాలుగు ఆటలకు కలిపి వచ్చేంత వసూళ్లు, ఈ చిత్రానికి సీడెడ్ లో బెన్ఫిట్ షోస్ నుండి వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి అనేది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు కలిపి కేవలం బెన్ఫిట్ షోస్ నుండే 12 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన రికార్డు కాదు, దీనిని టాలీవుడ్ లో బద్దలు కొట్టే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం. ఆయన నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పెట్టిన ఈ అరుదైన రికార్డు ని పవన్ కళ్యాణ్ బద్దలు కొడుతాడా లేదా అనేది చూడాలి.
ఈ చిత్రానికి ముందే ‘పుష్ప 2’, ‘గేమ్ చేంజర్’ వంటి సినిమాలు విడుదల కాబోతున్నాయి. సరైన ప్రమోషనల్ కంటెంట్ వదిలితే ఈ రెండు సినిమాల మేకర్స్ కూడా ఈ రికార్డు ని బద్దలు కొట్టేందుకు టార్గెట్ చేయొచ్చు. ఇదంతా పక్కన పెడితే ‘దేవర’ చిత్రం ఒంగోలు లో ఒక థియేటర్ నుండే 15 లక్షల రూపాయిల గ్రాస్ మొదటి రోజున రాబట్టింది. మరోపక్క అనంతపురం లో కూడా మొదటి రోజు ఒక థియేటర్ లో 19 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. చరిత్ర కనీవినీ ఎరుగని రేంజ్ గ్రాస్ వసూళ్లు ఇవి. ఎన్టీఆర్ ని ‘మ్యాన్ ఆఫ్ ది మాసెస్’ అని ఎందుకు అంటారో ఈ వసూళ్లను చూసి అర్థం చేసుకోవచ్చు.