https://oktelugu.com/

Devara Collections: ‘దేవర’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..అనేక ప్రాంతాల్లో 2వ రోజు కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిందిగా!

ముఖ్యంగా 10 వ రోజు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద 'దేవర' ర్యాంపేజ్ చూపించింది అనే చెప్పాలి. ప్రతీ సెంటర్ లో మార్నింగ్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే నిన్న వచ్చిన వసూళ్లు 2వ రోజు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : October 7, 2024 / 02:27 PM IST

    Devara 10 Days Collections

    Follow us on

    Devara Collections: భారీ అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవరం లేదు. అయితే మొదటి వారం వసూళ్లు ఒక ఎత్తు అయితే, రెండవ వారం వసూళ్లు ఇంకా అద్భుతంగా ఉండడం విశేషం. కారణం ఇటీవలే స్కూల్ పిల్లలకు దసరా సెలవలు ఇవ్వడమే. అందుకే 2వ వీకెండ్ లో ఎన్టీఆర్ తన ఉగ్ర రూపం చూపించాడు. ముఖ్యంగా 10 వ రోజు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ‘దేవర’ ర్యాంపేజ్ చూపించింది అనే చెప్పాలి. ప్రతీ సెంటర్ లో మార్నింగ్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే నిన్న వచ్చిన వసూళ్లు 2వ రోజు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

    10 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 10వ రోజు దాదాపుగా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. జీఎస్టీ తో కలిపి 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది అనే చెప్పొచ్చు. ఎన్టీఆర్ కెరీర్ లో ఇలాంటి లాంగ్ రన్ ఉన్న సినిమా వచ్చి చాలా కాలమే అయ్యింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతంలో 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా నైజాం ప్రాంత హక్కులను దిల్ రాజు సుమారుగా 45 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. నిన్నటితో బ్రేక్ ఈవెన్ మార్కు దాటింది.

    అలాగే సీడెడ్ లో ఈ చిత్రం నిన్నటితో 24 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది. ఓవరాల్ గా ఈ చిత్రం నిన్నటితో ప్రపంచవ్యాప్తంగా 165 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిందట. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 180 కోట్ల రూపాయలకు జరిగింది. ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కు దాటి సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకోనుంది దేవర. ఇదంతా పక్కన పెడితే నేటి నుండి ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో మామూలు టికెట్ రేట్స్ ఉండనున్నాయి. టికెట్ రేట్స్ తగ్గగానే నేడు ఈ సినిమాకి మార్నింగ్ షోస్ నుండే అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి . ట్రెండ్ చూస్తుంటే ఈ చిత్రానికి నేడు కూడా రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేలా అనిపిస్తుందని అంటున్నారు. ఈమధ్య కాలం లో రెండవ సోమవారం ఇంత స్టడీ వసూళ్లను రాబట్టిన సినిమా మరొకటి లేదు. మొదటి వీకెండ్ తర్వాత లాంగ్ రన్ లో కేవలం వీకెండ్స్ మాత్రమే మంచి వసూళ్లు వచ్చేవి, కానీ ‘దేవర’ చిత్రానికి వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ వస్తున్నాయి.