Akkineni Akhil: బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ – పూజ హెగ్డే జంటగా నటించిన సినిమా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఈ చిత్రాన్ని జి ఎ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా గీతా ఆర్ట్స్ సమర్పణలో దసరా సందర్భంగా ఈనెల 15వ తేదీన థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. పవన్ సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్ అని చెప్పాలి.
కాగా దసరా కానుకగా విడుదలైన మిగతా చిత్రాలన్నిటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే సూపర్ హిట్ గా నిలిచింది. అఖిల్ కి మొదటి హిట్ ఇచ్చిన చిత్రంగా కూడా ఈ మూవీని చెప్పవచ్చు. ఇప్పటికి ఈ మూవీ ఫుల్ రన్ తో సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో డిలీట్ చేసిన పెళ్లిచూపులు సీన్ నీ గీతాఆర్ట్స్ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. పెళ్లి చూపుల కోసం వెళ్లి… అమ్మాయి ముందు షర్ట్ విప్పి రచ్చ చేస్తాడు అక్కినేని అఖిల్. ఈ సీన్ లో తన యాక్టింగ్ తో అఖిల్ అదరగొట్టాడు. అయితే ఈ సీన్ ను సినిమాలో మొదట పెట్టాలని అనుకున్న చిత్రబృందం… కొన్ని కారణాల వల్ల డిలీట్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సీన్ కూడా మూవీ లో బాగుండు అని అఖిల్ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ దేలేటెడ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Deleted scene released from most eligible bachelor movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com