Deepthi Sunaina: సోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో దీప్తి సునైన హాట్ ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా చీరకట్టులో దీప్తి గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. నడుము వంపులు చూపిస్తూ టెంపరేచర్ పెంచేసింది. సాంప్రదాయ లుక్ లో సైతం దీప్తి సూపర్ సెక్సీగా ఉన్నారు. దీప్తి అందానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్ తో విరుచుకుపడుతున్నారు.

దీప్తి-షణ్ముఖ్ డాన్స్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ ని షేక్ చేశారు. యూట్యూబ్ స్టార్స్ గా ఇద్దరూ వెలిగిపోయారు. యూట్యూబ్ వారిద్దరికీ గుర్తింపు తెచ్చింది. తాము ప్రేమికులమని ఓపెన్ గా ప్రకటించారు. దాదాపు ఐదేళ్లు దీప్తి-షణ్ముఖ్ ప్రేమించుకున్నారు. ఐతే గత ఏడాది ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారు. దీప్తి సోషల్ మీడియాలో షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు ప్రకటన చేసింది.
షణ్ముఖ్ కి ఆమె బ్రేకప్ చెప్పడానికి సిరినే కారణమన్న ప్రచారం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ కంటెస్టెంట్ సిరితో చాలా సన్నిహితంగా ఉన్నారు. స్నేహితులమని చెప్పుకుంటూ విచ్చలవిడి రొమాన్స్ కురిపించారు. వీరి మధ్య తరచుగా గిల్లికజ్జాలు చోటు చేసుకునేవి. తిట్టుకోవడం, అలగడం మళ్ళీ కలిసిపోవడం చేసేవారు. ఇదంతా బయట నుంచి చూసిన దీప్తి హర్ట్ అయ్యారు. షణ్ముఖ్ రన్నర్ గా నిలిచాడు. అతడు హౌస్ నుండి బయటికొచ్చిన కొద్దిరోజులకు దీప్తి బ్రేకప్ ప్రకటన చేసింది.

అప్పటి నుండి వేరుగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఒకరిపై మరొకరు సెటైర్స్ వేసుకుంటూ ఉంటారు. వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనిపిస్తుంది. బ్రేకప్ తర్వాత ఇకపై కెరీరే ముఖ్యమని దీప్తి వెల్లడించారు. నటిగా ఎదిగే ప్రయత్నాల్లో దీప్తి ఉన్నారు. సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. షణ్ముఖ్, దీప్తి విడిపోవడం వలన సంపాదన కోల్పోయారనే వాదన ఉంది.
కాగా బిగ్ బాస్ సీజన్ 2 లో దీప్తి పాల్గొన్నారు. ఆ షోతో ఆమె బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న దీప్తి పది వారాలు హౌస్లో ఉన్నారు. హేమా హేమీలు పాల్గొన్న ఆ సీజన్లో పెద్దగా ఎవరికీ తెలియని దీప్తి అంత వరకు రాణించడం గొప్పే. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా కౌశల్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.