Bigg Boss 5 Telugu: సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ సెలబ్రిటీల్లో దీప్తి సునైనా (Deepthi Sunayana) ఒకరు. ఆమె తన అభిమానులను, ఫాలోవర్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అప్‌డేట్ చేస్తుంది. అంతే కాకుండా దీప్తి సునయన కి 3 మిలియన్లకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇన్‌స్టాగ్రామ్ లో. అభిమానులు కూడా ఆమె ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు . దీప్తి సునైనా, షన్ను గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. షన్ను పుట్టినరోజు సందర్భంగా దీప్తి సునైనా బిగ్ బాస్ సెట్స్ వేసిన అన్నపూర్ణ స్టూడియోస్‌కి కూడా వెళ్లింది.
అయితే గత కొన్ని రోజులుగా, బిగ్ బాస్ హౌస్‌లో సిరి హన్మంత్ మరియు షణ్ముఖ్‌ల సాన్నిహిత్యంపై దీప్తి సునైనా బాధపడినట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి సామజిక మాధ్యమాల్లో. బిగ్ బాస్ హౌస్ లో సిరి, షన్ను ఒకరికొకరు సన్నిహితంగా ఉన్నారని తెలుసుకున్న దీప్తి సునైనా అతనిని అన్‌ఫాలో చేసింది ఇన్‌స్టాగ్రామ్ లో. చాలా మంది అభిమానులు షన్ను ప్రవర్తన దీప్తి సునయనకు చికాకు కలిగించి ఉంటుందని కూడా అనుకున్నారు.
ఈ నేపథ్యం లో దీప్తి సునైనా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. షణ్ముఖ్‌ని ఎందుకు అన్‌ఫాలో చేశావని ఓ అభిమాని ప్రశ్నించగా, దీప్తి సునైనా మాట్లాడుతూ.. ‘‘కొంత కాలం పాటు ఒకరినొకరు అనుసరించకూడదని నిర్ణయించుకున్నాం. అయితే ఎంతకాలం వారిద్దరూ ఒకరినొకరు ఫాలో కాకుండా ఉంటారన్న సంగతి మాత్రం దీప్తి సునైనా చెప్పలేదు.