Deepika Padukone viral video: ఇండియా లో ఒక మేల్ సూపర్ స్టార్ కి ఉన్నంత ఫాలోయింగ్ , క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు దీపికా పదుకొనే . డైరెక్టర్ , హీరో తో సంబంధం లేకుండా , కేవలం ఈమెని చూడడం కోసం థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా వందల కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను అందుకుంటూ ఉంటాయి. ప్రముఖ హీరో రణవీర్ సింగ్ ని పెళ్లాడిన తర్వాత సినిమాలను కాస్త తగ్గించినప్పటికీ కూడా దీపికా పదుకొనే క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఇదంతా పక్కన పెడితే ఈమెకు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో మరోసారి వైరల్ గా మారింది. ఈ వీడియో ని చూసి దీపికా ప్రవర్తనపై కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో ఈమె బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో కలిసి ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ అనే చిత్రం చేసింది. సౌత్ ఇండియన్ మూవీస్ ఫ్లావర్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఆరోజుల్లో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. అప్పట్లోనే ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 423 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చాయి. 2013 వ సంవత్సరం లో ఈ స్థాయి వసూళ్లు అనేది సాధారణమైన విషయం కాదు. ఈ చిత్రం ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం మూవీ లోనే కాదు , షూటింగ్ సెట్స్ లో కూడా మూవీ యూనిట్ మొత్తం ఫన్నీ మోడ్ లోనే ఉన్నారు. అందుకు సంబంధించిన ఒక బ్లూపర్ వీడియో లో దీపికా పదుకొనే కూల్ డ్రింక్ తాగుతుండగా డైరెక్టర్ రోహిత్ శెట్టి అడ్డుకుంటాడు.
దీనికి ఆగ్రహించిన దీపికా పదుకొనే , ఆమె చేతిలోని బాటిల్ ని తీసుకొని, రోహిత్ శెట్టి నెత్తి ని పగలగొట్టింది. ఈ వీడియో ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే , ఇదంతా కేవలం ఫన్నీ బ్లూపర్ గానే షాట్ చేశారు. దీపికా చేతిలో ఉన్నది నిజమైన బాటిల్ కాదు , షుగర్ బాటిల్. మన తెలుగు లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షోలో అప్పుడప్పుడు నామినేషన్స్ సమయంలో ఇలాంటి షుగర్ బాటిల్స్ ని ఉపయోగిస్తుంటారు గుర్తుందా ?, అదే ఇది. ఈ వీడియో ఇప్పుడు మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది. ఇకపోతే దీపికా పదుకొనే ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి ‘రాకా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.