Deepika:హైదరాబాద్​కు దీపికా.. ప్రభాస్​ సినిమా షూటింగ్​ కోసమేనట?

Deepika: బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణె వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాలకు షూటింగ్ నిమిత్తం వరుస ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. తాజాగా దీపికా హైదరాబాద్​ వెళ్తుండగా.. ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. ఈ ప్రయాణం ఓ షూట్​ కోసమని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమాలో అమితాబ్​ బచ్చన్​ కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్​ కోసమే […]

Written By: Raghava Rao Gara, Updated On : December 4, 2021 6:51 pm
Follow us on

Deepika: బాలీవుడ్​ బ్యూటీ దీపికా పదుకొణె వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాలకు షూటింగ్ నిమిత్తం వరుస ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. తాజాగా దీపికా హైదరాబాద్​ వెళ్తుండగా.. ముంబయి విమానాశ్రయంలో కనిపించింది. ఈ ప్రయాణం ఓ షూట్​ కోసమని తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమాలో అమితాబ్​ బచ్చన్​ కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్​ కోసమే దీపికా హైదరాబాద్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

Deepika

సైన్స్​ ఫిక్షన్​ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో దీపికా టాలీవుడ్​లో అరంగేట్రం చేయనుంది. అయితే, ఈ సినిమాకు తాత్కాలికంగానే ప్రాజెక్ట్ కె అని టైటిల్ పెట్టారు. వైజయంతీ మూవీస్ ఈ సినిమాను భారీ బడ్దెట్​తో నిర్మిస్తోంది.  కాదా, 2022లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయనున్నారు. ప్రముఖ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ బృందానికి మెంటార్‌గా వ్యవహరించనున్నారు.

Also Read: క్రికెటర్ మిథాలీ రాజ్‌ బయోపిక్ లో తాప్సీ… ‘శభాష్‌ మిథూ’ రిలీజ్ ఎప్పుడంటే ?

కాగా, ఈ సంవత్సరం ప్రారంభంలోనే అమితాబ్​తో ఈ సినిమా షూటింగ్​ను ప్రారంభించారు. ఈ సినమాలో బిగ్​బీ పాత్ర గురించి అశ్విన్ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ.. బచ్చన్ సర్​ మా సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు రాధేశ్యామ్​ సినిమాతో ఫుల్​ బిజీగా ఉన్న ప్రభాస్.. ఆ సినిమాతో పాటు సలార్​, ఆదిపురుష్​ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తికాగా.. సలార్​ కొనసాగుతోంది.

Also Read: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం