https://oktelugu.com/

Karthika Deepam:  హీనంగా మారిన వంటలక్క పరిస్థితి.. మరీ ఇంత దారుణమా!

Karthika Deepam:  బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. కార్తీక్.. హిమ, సౌర్య కనిపించకపోయేసరికి రుద్రాణి కూడా తీసుకెళ్ళిందేమో అని భయపడతాడు. వెంటనే దీపకు చెప్పటంతో ఇద్దరు వెతుకుతారు. ఇక పిల్లలు ఇద్దరు కనిపించటంతో వాళ్ల దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని కాసేపు మాట్లాడుతారు. మరోవైపు రుద్రాణి పిల్లలలో ఎవర్నో ఒకర్ని దత్తత తీసుకోవాలని అనుకుంటుంది. మరోవైపు దీప, కార్తీక్ రోడ్డుపై వెళ్తుంటారు. పిల్లలు ఇక్కడ ఉండలేకపోతున్నారు అంటూ కార్తీక్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 21, 2021 / 09:55 AM IST
    Follow us on

    Karthika Deepam:  బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. కార్తీక్.. హిమ, సౌర్య కనిపించకపోయేసరికి రుద్రాణి కూడా తీసుకెళ్ళిందేమో అని భయపడతాడు. వెంటనే దీపకు చెప్పటంతో ఇద్దరు వెతుకుతారు. ఇక పిల్లలు ఇద్దరు కనిపించటంతో వాళ్ల దగ్గరికి వెళ్లి ఏం జరిగిందని కాసేపు మాట్లాడుతారు. మరోవైపు రుద్రాణి పిల్లలలో ఎవర్నో ఒకర్ని దత్తత తీసుకోవాలని అనుకుంటుంది.
    మరోవైపు దీప, కార్తీక్ రోడ్డుపై వెళ్తుంటారు.

    Karthika Deepam

    పిల్లలు ఇక్కడ ఉండలేకపోతున్నారు అంటూ కార్తీక్ అనడంతో దీప ధైర్యం చెబుతుంది. డాక్టర్ బాబు పిలుపును ప్రేమతో పిలుచుకోలేకపోతున్నాను అని అంటూ బాధపడుతుంది. పేరు పెట్టి పిలవడం ఇబ్బందిగా ఉందని సామి అని పిలుస్తుంది. తన వెంట కార్తీక్ ను రావద్దని పదే పదే ఇంటికి వెళ్ళిపో అని చెబుతోంది. కార్తీక్ ను చూసుకుంటూ తన మనసులో తన బంగారం అమ్మితే ఎక్కడ బాధపడతాడు అని పంపిస్తున్నాను అని అనుకుంటుంది.

    Also Read: కట్నం డబ్బులతో పరారైన వరుడు… ఆందోళనకు దిగిన వధువు.. చివరికి ఇలా!

    ఇక సౌందర్య కార్తీక్ వాళ్ళ కోసం పోలీస్ ఆఫీసర్ కు ఫోన్ చేసి మాట్లాడుతుంది. వెంటనే ఆనందరావు వారి గురించి ఎంక్వయిరీ చేయద్దు అని సౌందర్యతో చెబుతాడు. అక్కడే ఉండి ప్రశాంతంగా ఉండనివ్వు అని ఇక్కడికొస్తే మోనిత మళ్లీ ఎదురు తిరుగుతుందని అంటాడు. కానీ వాళ్లను కోల్పోతున్నాము అని బాధగా ఉందని బాధపడతాడు. ఇక దీప బంగారం షాపు దగ్గరికి వెళ్లి తన చెవి కమ్మలు, మంగళ సూత్రం, గాజులను తీస్తూ అని తలుచుకుంటూ బాధపడుతుంది.

    ఇక బంగారం కొనుక్కునే ఆ షాపు ఓనర్ రుద్రాణి పంపిన ఫోటో ను చూసి ఆమె ఈమెనే కదా అనుకొని తన బంగారం తాకట్టు తీసుకోవడానికి నిరాకరిస్తాడు. వెంటనే దీప ఇదంతా కుదరని పని అని గుర్తుపట్టి రుద్రాణి కి ఫోన్ చేసి బ్రతిమాలుకుంటుంది. ఇక రుద్రాణి తర్వాత మరో పెద్ద ప్లాన్ చేస్తూ తన బంగారం తాకట్టుకు ఒప్పుకుంటుంది. మొత్తానికి వంటలక్క పరిస్థితి పేద వాళ్ళ కంటే హీనంగా మారింది.

    Also Read: మోనిత ఫోటో ఫ్రేమ్ ను పగలకొట్టిన సౌందర్య.. రుద్రాణి మాటలకు ఒప్పందం తీసుకున్న కార్తీక్!