Ishtam Movie Hero Charan Reddy: తన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు చాలా గ్యాప్ తర్వాత నిర్మించిన సినిమా ‘ఇష్టం’. ఈ సినిమా 2001లో వచ్చింది. ఈ సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, మంచి పేరు దక్కించుకున్నప్పటికీ.. మళ్లీ చరణ్ రెడ్డి ఏ సినిమాలో నటించలేదు. కానీ పదకొండేళ్ల తర్వాత అంటే 2012, మార్చి 19న ఆయన చనిపోయాడన్న వార్త వచ్చింది. ఆ వార్త విని అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయ్యారు.

అసలు చరణ్ రెడ్డి ఎలా చనిపోయాడు ? గుండెపోటుతో చనిపోయాడని అన్నారు. కానీ దాని వెనుక ఎవరికీ తెలియని ఓ విషాద గాథ ఉంది. ఆకస్మాత్తుగా చరణ్ చనిపోయాడు. అప్పటికి చరణ్ వయసు 36 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో ఎలా చనిపోయాడు. అసలు ఏమి జరిగింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన చరణ్ రెడ్డి అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ(‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ హీరోయిన్) ను ప్రేమించాడు.
Also Read: మొదటి భార్యతో విడిపోయి రెండో పెండ్లికి రెడీ అవుతున్న హీరోలు వీరే
పెద్దలు కూడా వీరి ప్రేమను అంగీకరించి పెళ్లి చేశారు. అయితే, ఆ ప్రేమ ఎంతో కాలం నిలబడలేదు. సుప్రియ, చరణ్ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. చరణ్ తాగుడికి బానిస అయ్యాడు. దీనికితోడు గుండెనొప్పి రావడంతో చరణ్ ను హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ వెంటనే మళ్ళీ గుండె నొప్పి రావడంతో చరణ్ రెడ్డి చనిపోయాడు.

అయితే చరణ్ రెడ్డికి శవ పరీక్షలు చేసిన ఉస్మానియా డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం మద్యానికి బానిస కావడం వల్లే చరణ్ లివర్ పూర్తిగా పాడైపోయిందని, ఆ కారణంగా అతడు చనిపోయాడు అని తేల్చి చెప్పారు. అయితే, కుటుంబ కలహాల కారణంగా చరణ్ మనోవేదనకు గురై మద్యానికి బానిసయ్యాడని తెలుస్తోంది.
దాంతో చరణ్ రెడ్డిని సరిగ్గా ఎవరూ పట్టించుకోలేదు అని, ఈ క్రమంలోనే ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి చనిపోయాడని ఆ తర్వాత తెలిసింది. చరణ్ అక్కినేని కుటుంబానికి అల్లుడని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. పాపం తనకు సినీ అవకాశాలు ఎవ్వరూ ఇవ్వకపోయినా.. ఇతర ఆర్ధిక ఇబ్బందులు వచ్చినా ఎన్నడూ చరణ్ అక్కినేని పేరును వాడకపోవడం చరణ్ గొప్పతనానికి నిదర్శనం.
Also Read: నా డబ్బు కాజేసి.. నన్ను ఇంట్లో నుంచి గెంటేశాడు – తనికెళ్ల భరణి