Insult To Balayya: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ కి ఉన్న మాస్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయన సినిమాలకు అభిమానులు ఎలాంటి హడావుడి చేస్తారో..పుట్టిన రోజు వేడుకలు అన్నా కూడా అదే రేంజ్ లో పండుగలా చేస్తారు..కేక్ కట్టింగ్స్ దగ్గర నుండి..అన్నదానాలు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వరుకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు..ఈ ఏడాది జూన్ 10 వ తారీఖున బాలయ్య తన 62 వ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..ప్రతి ఏడాది జరిపినట్టే ఈ ఏడాది కూడా బాలయ్య బాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరిపారు అభిమానులు..కానీ పుట్టిన రోజు నాడు సెలెబ్రిటీల నుండి బాలయ్య బాబు కి ఘోరమైన అవమానం జరిగింది అంటూ నందమూరి అభిమానులు ఫీల్ అవుతున్నారు..అదేమిటి అంటే ప్రతి ఏడాది బాలయ్య బాబు పుట్టిన రోజునాడు సెలెబ్రిటీల విషెస్ తో సోషల్ మీడియా మొత్తం నిండిపోతుంది..కానీ ఈ ఏడాది మాత్రం టాలీవుడ్ టాప్ హీరోలు కానీ..యువ హీరోలు కానీ బాలయ్య బాబు పుట్టినరోజు ని పట్టించుకోలేదు..ప్రతి ఏడాది తన బాబాయి పుట్టిన రోజుకు మర్చిపోకుండా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియచేసే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈసారి పట్టించుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.

Also Read: Prathyusha Garimella: ప్రత్యూష ఆత్మహత్యలో షాకింగ్ నిజాలు.. పదిరోజుల ముందే ఆ పని చేసిందట!
అంతే కాకుండా ప్రతి సెలబ్రిటీ పుట్టిన రోజు కి మర్చిపోకుండా శుభాకాంక్షలు తెలియచేసే మహేష్ బాబు మరియు చిరంజీవి వంటి వారు కూడా బాలయ్య బాబు పుట్టినరోజు ని మర్చిపోవడం నిజంగా షాక్ అనే చెప్పాలి..బాలయ్య బాబు ప్రస్తుతం అఖండ సినిమా విజయం తో మంచి జోష్ మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తో పాటుగా ఆయన ఆహా మీడియా లో చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది..ఈ ప్రోగ్రాం ద్వారానే బాలయ్య బాబు ఫామిలీ ఆడియన్స్ కి కూడా బాగా దగ్గర అయ్యాడు..ఇలా కెరీర్ లో చాలా కాలం తర్వాత బాలయ్య బాబు పీక్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉండడం తో అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు..ప్రస్తుతం బాలయ్య బాబు క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..బాలయ్య పుట్టినరోజు నాడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేసారు..దీనికి రెస్పాన్స్ అదిరిపోయింది..ఈ సినిమా తో పాటుగా ఆయన అనిల్ రావిపూడి తో ఒక్క సినిమా చేస్తున్నాడు..ఇవి కాకుండా త్వరలోనే బోయపాటి శ్రీను అఖండ 2 తో పాటు గా ఒక పొలిటికల్ సబ్జెక్టు తో కూడా సినిమాలు చెయ్యనున్నాడు..ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్ లో ఎన్నడూ లేనంత జోష్ ని అభిమానుల్లో నింపుతున్నాడు బాలయ్య బాబు.

Also Read: Allu Arjun Huge Lossed: సుకుమార్ వల్ల భారీగా నష్టపోయిన అల్లు అర్జున్
[…] […]