Ranu Bombai Ki Ranu Song Income: యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ కి ఈమధ్య కాలంలో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తెలంగాణ ఫోక్ సాంగ్ హిట్ అయితే చాలు ప్రపంచమంతా వినిపించేస్తుంది. అలా తెలంగాణ ఫోక్ సాంగ్స్ లో ‘రాను ముంబై కి రాను'(Raanu Bombai Ki Raanu) పాట ఒక చరిత్ర అనుకోవచ్చు.రామ్ రాథోడ్(Ram Rathod) ఈ పాటకు లిరిక్స్ రాయడమే కాకుండా, తన సొంత డబ్బులతో ఈ పాట ని చిత్రీకరించాడు. ఇక ఈ పాటలో రామ్ రాథోడ్ సరసన లిఖిత(Likitha) అనే అమ్మాయి చిందులేసింది. ఈమెకు కూడా ఈ పాట అద్భుతమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరు ఈ పాట ని ఎంజాయ్ చేస్తారు. ఏ ఫంక్షన్ లో చూసినా, ఏ టీవీ ఎంటర్టైన్మెంట్ షో ని గమనించినా ఈ పాట లేకుండా ఉండదు.
కేవలం తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ మాత్రమే కాదు, విదేశీయుల్లో నుండి కూడా ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాట లో రామ్ రాథోడ్ తో కలిసి చిందులేసిన Likitha రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె ఈ పాటకు సంబంధించిన విశేషాలు చెప్పగా అవి బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘ ముందుగా ఈ పాట కోసం మేము రెండు వెర్షన్ పాటలను రెడీ చేసుకున్నాం. రెండో వెర్షన్ పాటనే ‘రాను ముంబై కి రాను’ పాట. ఈ పాటని పూర్తి చేయడానికి మాకు కేవలం ఒకే ఒక్క రోజు సమయం పట్టింది. ముందుగా ప్రోమో ని విడుదల చేసాము. సోషల్ మీడియా నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ ప్రోమో కి 1 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి’.
‘ఆడియన్స్ లో ఒక్కసారిగా ఈ ప్రోమో కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో, మరింత గొప్పగా తియ్యాలని ఇంకో రోజు సమయం తీసుకొని షూటింగ్ చేసాము. ఈ పాట కచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాము కానీ ఈ రేంజ్ లో హిట్ అవ్వుతుందని మాత్రం అనుకోలేదు. ఎలాంటి గుర్తింపు లేని నాకు, ఈ పాట తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నా పేరు కూడా జనాలకు సరిగా తెలియదు, కానీ ‘రాను ముంబై కి రాను’ అమ్మాయి అంటూ మా ఇంటి వద్దకు వచ్చి నాతో ఫోటోలు దిగుతున్నారు. ఇప్పటి వరకు ఈ పాట నుండి కోటి రూపాయిల ఆదాయం వచ్చింది. నిర్మించడానికి అయిన ఖర్చు కేవలం 5 లక్షలు మాత్రమే. రామ్ రాథోడ్ అన్న ఈ పాట ద్వారా వచ్చిన ఆదాయం తో ఒక విల్లా కొన్నదంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. అందులో ఎలాంటి నిజం లేదు. నేను కూడా రెమ్యూనరేషన్ నాకు ముందుగా ఎంత ఇస్తానని చెప్పారో అంతే ఇచ్చారు. పాట పెద్ద హిట్ అయ్యి భారీ లాభాలు వచ్చాయి కదా అని నేను అందులో ఎలాంటి వాటాలు అడగలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.