Daku Maharaj : వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద గత నాలుగేళ్ల నుండి దూసుకుపోతున్న బాలయ్య కి ‘డాకు మహారాజ్’ చిత్రం బ్రేకులు వేసిందా అంటూ అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి రోజు ఓపెనింగ్స్, ఆ తర్వాత సంక్రాంతి సెలవుల్లో వచ్చిన భారీ వసూళ్లు మినహా, డాకు మహారాజ్ కి ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదని అంటున్నారు. సీడెడ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పర్వాలేదు అనే రేంజ్ థియేట్రికల్ రన్ వస్తుంది కానీ, మిగతా ప్రాంతాల్లో సినిమాకి దాదాపుగా క్లోజింగ్ పడినట్టే అని అంటున్నారు. ఈరోజు అయితే అనేక ప్రాంతాల్లో షేర్ వసూళ్లు వచ్చే సూచనలు చాలా తక్కువగా ఉన్నాయని, రేపటి నుండి కమీషన్ బేసిస్ మీద మాత్రమే ఈ సినిమా రన్ అవుతుందని అంటున్నారు. నైజాం ప్రాంతం లో రిటర్న్ జీఎస్టీ తీసేస్తే ఈ సినిమాకి ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదట.
దశాబ్దాల నుండి బాలయ్య బాబు సీడెడ్ లో కింగ్ గా కొనసాగుతున్నాడు. ఆయన నటించిన సినిమాలు ఎక్కడ ఆడినా, ఆడకపోయినా సీడెడ్ ప్రాంతం లో మాత్రం టాక్ తో సంబంధం లేకుండా దుమ్ము దులిపేస్తాయి. అలాంటిది ఈ చిత్రానికి ఇంత పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో షేర్ వసూళ్లు రావడం లేదట. డిజాస్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ తో సమానంగా వసూళ్లు రాబడుతున్నాయట. ‘డాకు మహారాజ్’ కి వచ్చిన పాజిటివ్ టాక్, గేమ్ చేంజర్ కి వచ్చి ఉండుంటే సీడెడ్ ప్రాంతం నుండే 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి ఉండేది. కానీ అది జరగలేదు. విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం భారీ కమర్షియల్ హిట్ అవ్వడం, ఆడియన్స్ అత్యధిక శాతం ఆ సినిమాకే మొగ్గు చూపడం వల్ల ఈ చిత్రాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, దాని ఫలితమే ఇలా వచ్చిందని అంటున్నారు.
కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం లో మాత్రం ఈ చిత్రం ఉనికిని కాపాడుకుంది. ఈ ప్రాంతం లో మామూలుగానే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు భారీ లెవెల్ లో పెర్ఫార్మన్స్ ఇస్తాయి. అలా ‘డాకు మహారాజ్’ కి కూడా కలిసి వచ్చింది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం ఫెయిల్యూర్ గానే మిగిలింది.. ప్రతీ ప్రాంతంలోనూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర ప్రభావం చాలా బలంగా పడింది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ చిత్రానికి 68 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. మరి ఆ బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ సినిమా అందుకుంటుందా అంటే ప్రస్తుతానికి డౌటే అని అంటున్నారు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఏ రేంజ్ వద్దకు ఈ సినిమా ఆగుతుంది అనేది.