Daksha Nagarkar : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకొని స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందాలనే ఉద్దేశ్యం తో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. కానీ కొంతమందికి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలు వస్తుంటే, మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీ లో సక్సెస్ కాలేక తొందరగానే ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు.
అయితే దక్ష నగార్కర్ మాత్రం తమదైన రీతిలో సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ నటన పరంగా తనకంటూ ఒక మంచి పేరునైతే సంపాదించుకుంది. ఇక ఈమె ఏకే రావు పీకే రావు , హోరాహోరీ, హుషారు, జాంబిరెడ్డి లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంది. వాటితో పాటుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా వచ్చిన బంగార్రాజు సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఇక ముఖ్యంగా ఈమె బంగార్రాజు ఈవెంట్ లో స్టేజ్ పైన నాగచైతన్య తో ముసి ముసి నవ్వులు నవ్వడంతో ఈమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన రావణాసుర సినిమాలో సుశాంత్ కి లవర్ గా నటించి తనదైన మార్క్ నటనని చూపిస్తూ మంచి గుర్తింపు ను సంపాదించుకుంది.
అయితే ఇప్పుడు ఈ అమ్మడికి కొంచెం అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో తన అంద చందాలతో కుర్రాళ్ళ మతులు పోగొట్టే విధంగా తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే,మరోవైపు దర్శక, నిర్మాతలను కూడా ఇండస్ట్రీ లో దక్ష నగార్కర్ అనే ఒక హీరోయిన్ ఉంది మీరు గుర్తించండి అనే విధంగా ఆమె ఫోటోలను షేర్ చేస్తుంది.
దక్ష నగార్కర్ మంచి నటి అయినప్పటికీ ఆమెకి భారీ సక్సెస్ అనేది రాకపోవడం తో ఆమెకి పెద్దగా గుర్తింపు రావడం లేదు. అందువల్ల ఆమెకి అవకాశాలు రావడం లేదు ఒకవేళ వచ్చిన కూడా చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి తప్ప మెయిన్ లీడ్ చేసే ఒక్క క్యారెక్టర్ కూడా ఆమెకు పడడం లేదు అలాంటి క్యారెక్టర్ ఒక్కటి కనక ఆమెకి పడినట్లు అయితే ఆమె ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ కు గుర్తింపు పొందుతుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…