Rana Daggubati: టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం నిర్మాతగా దగ్గుబాటి రానా టాక్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాల స్పీడు కొంచెం తగ్గించినప్పటికీ బిజినెస్ లో, టాక్ షోలతో బిజీగా గడిపేస్తున్నారు రానా. తాజాగా దగ్గుపాటి రానా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రానా అమ్మమ్మ గారు అనారోగ్యంతో కన్నుమూశారు. అమ్మమ్మ అంతిమయాత్రలో రానా అమ్మమ్మ పాడే ను మోసారు. అమ్మమ్మతో తన చిన్ననాటి జ్ఞాపకాలను బంధువులతో పంచుకున్నారు రానా. ఇంట్లో ఉండే ప్రతి చిన్నారులకు అమ్మమ్మ, నానమ్మ అంటే చాలా ఇష్టం ఉంటుంది. తల్లి కోపపడిన సందర్భంలో పిల్లలు ఇంట్లో ఉండే పెద్ద వాళ్ళ వెనక్కి వెళ్లి దాక్కుంటారు. వాళ్ల చెంగు ముఖానికి కట్టుకొని దాగుడుమూతలు కూడా ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. ఇంట్లో వయస్సు పైబడిన వృద్ధులకు మనుమల చిలిపి చేష్టలు, వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడే మాటలు అన్ని తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి. ఇంట్లో ఉండే తమ మనుమలకు, మనుమరాళ్ళకు పెద్దవాళ్లు ఎంతో సరదాగా నీతి కథలు చెప్తుంటారు. పండగలకు తమ పిల్లల సంతానం ఇంటికి వచ్చినప్పుడు వారికి ఇష్టమైన తినుబండారాలు చేసిపడతారు. స్వయంగా తమ చేతులతో తమ మనుమలకు, మనమరాలకు తినిపించి తెగ సంబరపడిపోతారు పెద్దవాళ్లు. పిల్లల సంతోషంలో తమ కష్టాన్ని కూడా మర్చిపోతారు. ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు తమ అమ్మమ్మలతో, నాయనమ్మలతో ఎంతో అనుబంధం ఉంటుంది. పెద్దవాళ్లు పిల్లలతోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. కొంచెం సేపు పిల్లలు కనిపించకపోయినా వాళ్ళు ఎక్కడికి వెళ్లారని అడుగుతారు.
ఇటువంటి జ్ఞాపకాలే సినీ నటుడు దగ్గుబాటి రానాకు తన అమ్మమ్మతో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో తణుకు మాజీ శాసనసభ్యులు వైటి రాజా తల్లి, పారిశ్రామికవేత్త ఎలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి కన్నుమూశారు. ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ మరియు ఆయన కుమారుడు రానా ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. రాజేశ్వరి దేవి దగ్గుబాటి రానాకు అమ్మమ్మ అవుతారు. ఇక దగ్గుపాటి సురేష్ ఆమెకు అల్లుడు అవుతారు. రాజేశ్వరి దేవి అంతిమయాత్రలో పాల్గొన్నారు ఆమె పాడే ను మోసారు. అమ్మమ్మతో తనకున్న జ్ఞాపకాలను అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో అందరూ కూడా రా నాకు తణుకు ప్రాంతానికి ఉన్న అనుబంధం గురించి మాట్లాaడుకుంటున్నారు.
ఇది ఇలా ఉంటె దగ్గుపాటి రానా దగ్గుపాటి రామానాయుడు మనవడిగా లీడర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యారు.తెలుగు తో పాటు తమిళ్,హిందీ భాషలలో కూడా రానా నటించారు.సినిమాలలో విసువల్ ఎఫెక్ట్స్ సమన్వయకర్తగా రానా 70 సినిమాలకు పైగా చేసారు.స్పిరిట్ మీడియా అనే సొంత నిర్మాణ సంస్థ ద్వారా జాతీయ అవార్డు అందుకున్న ఒక చిత్రాన్ని నిర్మించారు రానా.చివరి సారిగా రానా విరాట పర్వం అనే సినిమాలో నటించారు.ప్రస్తుతం టాక్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.