Custody Collections: అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ బాక్స్ ఆఫీస్ వద్ద డివైడ్ టాక్ ని తెచ్చుకొని వసూళ్ల పరంగా డిజాస్టర్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. మీడియం రేంజ్ సినిమాలకు కనీస స్థాయి ఓపెనింగ్స్ అత్యవసరం. ఎందుకంటే ప్రారంభ వీకెండ్ చాలా అత్యవసరం.ఎంత వసూళ్లను రాబట్టిన ఈ మూడు రోజుల్లోనే లాగేయాలి. ఆ తర్వాత పెద్దగా రన్ ఉండదు, అదృష్టం కలిసి వస్తే ‘దసరా’, ‘విరూపాక్ష’ లాంటి సినిమాలు వస్తాయి.
ఎక్కువ శాతం మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఈమధ్య వీకెండ్ వరకు మాత్రమే ఆడుతున్నాయి. ‘కస్టడీ’ చిత్రం మొదటి వీకెండ్ లోనే కోల్పోవాల్సింది మొత్తం కోల్పోయింది. మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్స్ కి, జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అసలు ఏమాత్రం సంబంధం లేదు.22 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ జరుపుకున్న ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన వసూళ్లు కేవలం కోటి 80 లక్షల రూపాయిల షేర్ మాత్రమే.
రెండవ రోజు 80 లక్షల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా, మూడవ రోజు 70 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది. అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు మరియు మూడవ రోజు 50 శాతానికి పైగా వసూళ్లు డ్రాప్ అయ్యింది అన్నమాట. ఇది మూవీ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ కి ఏమాత్రం మంచింది కాదు. అలా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక మరియు ఓవర్సీస్ ప్రాంతాలను కూడా కలిపి ఈ చిత్రం 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిందని సమాచారం.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరగగా, బయ్యర్స్ కి 17 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలను రాబట్టింది సమాచారం.కొన్ని ప్రాంతాలలో ఈ చిత్రానికి రెండవ రోజు నుండే జీరో షేర్స్ వచ్చాయి. ఇక రేపటి నుండి అన్నీ ప్రాంతాలలో జీరో షేర్స్ వస్తాయని, మూవీ బిజినెస్ క్లోజ్ అయ్యిపోయినట్టే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.