https://oktelugu.com/

Rajini Kanth: గుండెపై రజినీకాంత్ టాటూ వేయించుకున్న క్రికెటర్ హర్భజన్ సింగ్…

Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రజినీకి కేవలం ఇండియా లోనే కాక విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. టాలీవుడ్, బాలీవుడ్‌ స్టార్ హీరోలలో కొందరు, తాము రజినీ అభిమానులం అని చెప్పుకున్నారంటే ఆయన రేంజ్ ఎంతో అర్దం చేసుకోవచ్చు. కాగా నిన్న రజిని బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 10:30 AM IST
    Follow us on

    Rajini Kanth: సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. రజినీకి కేవలం ఇండియా లోనే కాక విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. టాలీవుడ్, బాలీవుడ్‌ స్టార్ హీరోలలో కొందరు, తాము రజినీ అభిమానులం అని చెప్పుకున్నారంటే ఆయన రేంజ్ ఎంతో అర్దం చేసుకోవచ్చు. కాగా నిన్న రజిని బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన అభిమానులు ఒక్కొక్కరు తమదైన రీతిలో రజినీకాంత్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశారు. కొంతమంది అభిమానులు వినూత్న రీతిలో విషెష్ చెప్పారు. అయితే ఓ క్రికెటర్ ఏకంగా రజిని ఫోటోని గుండె మీద పచ్చ బొట్టు వేయించుకొని తన అభిమానాన్ని తెలియచేశాడు.

    ఆయన ఎవరో కాదు మన భజ్జీ భాయ్…  హర్భజన్ సింగ్.  ఇండియ‌న్ క్రికెట‌ర్ హ‌ర్బ‌జ‌న్ సింగ్ గురించి అందరికీ తెలిసిందే. భజ్జీ త‌న‌ స్టైల్‌లో రజినీకాంత్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు చెప్పి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. హ‌ర్బ‌జ‌న్ గుండెపై ర‌జినీకాంత్ టాటూను వేయించుకుని ఫోటోలు దిగాడు. ఆ టాటూని చూపిస్తూ దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసాడు హర్భజన్. ఆ ఫోటోని షేర్ చేస్తూ… నా ఛాతిపై సూప‌ర్ స్టార్ ఉన్నాడు. 80ల‌లో మీరు ’బిల్లా’, 90ల‌లో ‘భాషా’, 2వ శతాబ్దంలో ‘పెద్ద‌న్న’, ఒకే ఒక్క సినిమా సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు అంటూ పోస్ట్ చేసాడు హర్భజన్ సింగ్. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మేరకు హర్భజన్ ను పొగుడుతూ రజినీకాంత్ అభిమానులంతా పోస్ట్ లు పెడుతున్నారు.