Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళితో సినిమా ఎప్పుడుంటుందని ఓ జర్నలిస్టు డార్లింగ్‌ను అడిగాడు. ‘రాజమౌళి నాకు మంచి మిత్రుడు. సినిమా చేయమని ఆయన్ని ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదు. ఆయనతో సినిమా అంటే నేను రెడీగా ఉంటా. నిజానికి మా ఇద్దరికి ఓ ప్లాన్ ఉంది. అది ఎప్పుడు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ సినిమా తప్పకుండా ఉంటుంది’ అని క్లారిటీ ఇచ్చాడు.

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే…బిగ్‌బాస్ ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది. 24 గంటలు నాన్‌స్టాప్‌గా ప్రసారమయ్యే ఈ షోను బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేశారు. ఇప్పటి వరకు దీని లైవ్‌ను రెండున్నర గంటల ఆలస్యంతో ప్రసారం చేయగా.. ఇప్పుడు 24 గంటలు ఆలస్యంగా ప్రసారం చేయనున్నారట. అందుకే లైవ్ ఆపేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి OTT బిగ్‌బాస్‌కు పెద్దగా జనాదరణ లేదు. అనవసర సన్నివేశాలు, కంటెస్టెంట్ల బూతులు ప్రేక్షకులకు ఇబ్బందిగా మారాయి.
Also Read: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. మూవీ అలా ఉంటుందట

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. అనుపమ పరమేశ్వరన్ మెయిన్ రోల్‌లో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘బటర్‌ఫ్లై’. గంటా సతీష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది. డైలాగ్స్ లేకుండా సస్పెన్స్ అంశాలతో టీజర్‌ను రూపొందించగా అపార్ట్‌మెంట్‌లో దేని గురించో వెతుకుతూ భయభయంగా కనిపిస్తుంది అనుపమ.

డోంట్ బిలీవ్ యువర్ ఐస్, బ్రెయిన్ అనే క్యాప్షన్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి అనుపమ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
Also Read: సినిమా ప్రభాస్ ది.. ఫార్ములా చిరంజీవిది