Rajamouli: నేషనల్ రేంజ్ లోనే గొప్ప విజువల్ డైరెక్టర్ గా తనకంటూ వందల కోట్ల మార్కెట్ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ పాన్ ఇండియా సినిమా ప్రచారాన్ని ముంబయిలో ఇటీవల నిర్వహించారు. చరణ్, తారక్ ల మధ్య ఉన్న తేడా గురించి రాజమౌళి మాట్లాడారు. సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ వేడుకకు సంబంధించిన వీడియోల్ని చిత్ర బృందం విడుదల చేసింది.

కాగా రాజమౌళి మాట్లాడుతూ.. “రామ్ చరణ్ అద్భుతమైన నటుడు. కానీ, ఆ విషయం తనకు తెలియదు. ఎన్టీఆర్ కూడా అద్భుతమైన నటుడు. ఆ విషయం తనకు తెలుసు” అని ‘ఆర్‌ఆర్‌ఆర్ హీరోలు ఎన్టీఆర్ – చరణ్ ల గురించి ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. “ఓ సన్నిపోనికి సంబంధించిన చిత్రీకరణ పూర్తికాగానే రామ్ చరణ్‌ని హగ్ చేసుకుని బాగా చేశావు అని కితాబిస్తా. ‘బాగుందా సర్… మీకు నచ్చిందా సర్.. మీకు నచ్చితే ఓకే సర్ అని అంటాడు.
Also Read: మూడేళ్ల చిన్నారిపై ముసలివాడి అఘాయిత్యం
అదే తారక్ విషయానికొస్తే. తన నటన చూసి బాగుందని చెప్పేలోపు ‘జక్కన్నా..’ అదరగొట్టేశా కదా అంటాడు. తనపై తనకున్న విశ్వాసం అది. ఇలాంటి ఇద్దరు గొప్ప నటులతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. సినిమా కోసం వారిద్దరినీ విపరీతంగా కష్ట పెట్టా. చిత్రీకరణ తొలిరోజు నుంచే శ్రమపెట్టా. పరిచయ సన్నివేశం కోసం
తారక్‌ను పాదరక్షలు లేకుండా అడవిలో పరిగెత్తించా. చరణ్‌ను వేలమంది సభ్యుల మధ్య దుమ్ములో నిలబెట్టా.అంటూ రాజమౌళి చెప్పాడు.

దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతుంది ఈ ప్యాన్ ఇండియా మూవీ. మొత్తానికి జనవరి 7న రిలీజ్ కావాల్సిన ఈ భారీ సినిమా.. మార్చి 25కి షిఫ్ట్ అయింది. మరి ఆ డేట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.
Also Read: మూడేళ్ల చిన్నారిపై ముసలివాడి అఘాయిత్యం
[…] OTT: కరోనా కాలంలో సినిమాలకు ఊపిరి పోసింది ఓటీటీ సంస్థలే. పైగా నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇక కరోనా మూడో వేవ్ రావడంతో ప్రస్తుతం మళ్ళీ సినిమా రంగానికి కనిపిస్తున్న ఏకైక ఆశా కిరణం ఓటీటీ. ఎలాగూ ఈ కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. […]
[…] Oscar: సినిమా వాళ్ళకే కాదు, సినీ ప్రేమికులకు కూడా ఆస్కార్ అవార్డ్ ఓ కలల స్వప్నం. ఇంకా క్లుప్తంగా చెప్పుకుంటే.. ప్రపంచ సినీ లోకంలో ఆస్కార్ ఓ తిరుగులేని రారాజుగా వెలిగిపోతుంది. అందుకే సినీ గాలిలో తేలుతున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని కలలు కంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఇక ఆస్కార్ పోటీలో గెలిస్తే, ఇక తమ జీవితం ధన్యమై పోయిందని భావిస్తుంటారు. […]