Tollywood Trends: టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో హీరోయిన్ ఆదాశర్మ పోస్ట్ చేసిన ఓ ఫొటోపై నెటిజన్లు మండిపడగా.. తాజాగా ఆమె ఆ ఫొటోను డిలీట్ చేసింది. ఇటీవల మరణించిన ప్రముఖ సంగీత దర్శకుడు బప్పిలహిరి ఒంటిపై ఆభరణాల మాదిరి తాను కూడా ధరించిన ఫొటోను ఆదాశర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో బప్పీని ఆదా అవమానిస్తోందంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. అయితే అది ఫేస్‌బుక్‌లో షెడ్యూల్ చేసిన ఫొటో అని వివరణ ఇచ్చిన ఆదా.. దాన్ని డిలీట్ చేసింది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఒకటి. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మార్చి 1న టీజర్‌ను విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read: నాగార్జున వ్యాఖ్యాతగా చేయడం సిగ్గుచేటు.. కృతజ్ఞతలు చెప్పిన సామ్

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. భీమ్లానాయక్ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినిమా చూసిన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా పవన్ వీరాభిమాని నితిన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ ‘ఇది కదా మాకు కావాలిసింది’ అంటూ భీమ్లానాయక్‌పై ప్రశంసలు కురిపించాడు.

పవన్ కల్యాణ్ విధ్వంసం సృష్టించాడని, రానా ఇరగ్గొట్టాడని, తమన్ మ్యూజిక్‌లో ఫైర్ ఉందంటూ చిత్ర బృందాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. మొత్తానికి పవన్ భారీ హిట్ కొట్టాడు.
Also Read: “భీమ్లా నాయక్”కి నేను పిల్లర్ ఐతే, ఆయన సిమెంట్ – థమన్