Tollywood Trends : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సర్కారు వారి పాట చిత్రంలోని రెండవ పాట పెన్నీ సాంగ్‌ని రేపు విడుదల చేయబోతున్నారు. ఈక్రమంలో ఈ పాటకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. సూపర్ స్టార్ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ మహేశ్‌తో కలిసి ఘట్టమనేని సితార ఈ పాటలో చిందేసింది. ఇక తమన్ ఎప్పటిలానే పెన్నీ సాంగ్‌కి మంచి హుషారైన బీట్ ఇచ్చినట్టు ప్రోమో సాంగ్ తెలుపుతోంది.

మరో అప్ డేట్ విషయానికి వేస్తే.. భారత సినీ చరిత్రలోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా ది కశ్మీర్ ఫైల్స్ ఓ సంచలనం. ఉత్తరాది, దక్షిణాది అని తేడా లేదు, అందరూ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల రాధేశ్యామ్‌ని తీసి ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారంటే ఈ చిత్ర క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలోనే మొదటి రోజు రూ. 3 కోట్లున్న ఈ చిత్ర వాసూళ్లు తొలివారం ముగిసేసరికి రూ. 106.80 కోట్లకి చేరాయి.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ స్టైలే వేరు.. అప్పుడు బాడీగార్డ్.. ఇప్పుడు డిజిటల్ హెడ్

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. RRR క్రేజ్ వర్ణించడానికి మాటలు చాలట్లేదు. మెగా-నందమూరి హీరోలు ఒకే స్క్రీన్‌పై కలిసి నటిస్తుండడంతో ఫ్యాన్స్‌కి భూమ్మీద కాళ్లు నిలవట్లేదంటే అతిశయోక్తి లేదు. ఈక్రమంలో యూనివర్సల్ క్రేజ్‌తో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా RRR సాగుతోంది. తెలంగాణలో 6 షోలకు అనుమతినిచ్చినట్టు సమాచారం. ఇక మల్టీప్లెక్స్‌లో టికెట్ రేట్లు తొలివారం రూ. 300-400 గా ఉండనుందట, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100-295 అంటున్నారు.

ఇక ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. ప్రముఖ హీరో మోహన్‌బాబు తెలుగు సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఆఫర్ ప్రకటించారు. తనకు సంబంధించిన మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చేరే సినీ కార్మికుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లల విద్యా భవిష్యత్‌కు అండగా నిలవాలని సినీ కార్మికులను మోహన్ బాబు కోరారు.
Also Read: Puri Jagannadh: అప్పట్లో ‘పూరి’ సినిమాలను రిజెక్ట్ చేసిన హీరో.. ఇప్పుడు ఒక్క హిట్ లేదు..
Recommended Video:
[…] […]