https://oktelugu.com/

Crazy Update On Rajamouli Mahabharatam: రాజమౌళి ‘మ‌హా భార‌తం’ పై క్రేజీ అప్ డేట్.. రెండు పాత్రల్లో ఎన్టీఆర్

Crazy Update On Rajamouli Mahabharatam: ‘ఎప్పటికైనా భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సాంప్రదాయ పద్దతులను ప్రపంచానికి చాటి చెప్పే కంటెంట్‌ ని సృష్టించాలనే ఆలోచన నాకు ఎప్పటినుండో ఉందని’ రాజమౌళి ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ముఖ్యంగా తన క‌ల‌ల చిత్రం `మ‌హా భార‌తం`ను తీయాలని జక్కన్న ఆశ పడుతున్నాడు. ఈ సినిమాని 5 భాగాలుగా తీయాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. పైగా ఈ సినిమాతో త‌న కెరీర్‌కి పుల్ స్టాప్ పెట్టాల‌నుకుంటున్నాను అని కూడా ఆ మధ్య జక్కన్న […]

Written By:
  • Shiva
  • , Updated On : April 2, 2022 / 11:54 AM IST
    Follow us on

    Crazy Update On Rajamouli Mahabharatam: ‘ఎప్పటికైనా భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సాంప్రదాయ పద్దతులను ప్రపంచానికి చాటి చెప్పే కంటెంట్‌ ని సృష్టించాలనే ఆలోచన నాకు ఎప్పటినుండో ఉందని’ రాజమౌళి ఎప్పటి నుంచో చెబుతున్నాడు. ముఖ్యంగా తన క‌ల‌ల చిత్రం `మ‌హా భార‌తం`ను తీయాలని జక్కన్న ఆశ పడుతున్నాడు. ఈ సినిమాని 5 భాగాలుగా తీయాల‌న్న‌ది రాజ‌మౌళి ఆలోచ‌న‌. పైగా ఈ సినిమాతో త‌న కెరీర్‌కి పుల్ స్టాప్ పెట్టాల‌నుకుంటున్నాను అని కూడా ఆ మధ్య జక్కన్న చెప్పాడు.

    Rajamouli, NTR

    అన్నిటికీ మించి ఈ సిరీస్ లో కీలక పాత్ర అయిన కృష్ణుడు పాత్ర కోసం అమీర్ ఖాన్ కి ఎప్పుడో ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పి.. ఓకే చేయించుకున్నాడు కూడా. అయితే, ఈ సినిమాకి సంబంధించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా స్టార్ట్ కావడానికి క‌నీసం ఐదేళ్లు ప‌డుతుంది. అయితే.. ఈలోగా.. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ర‌చయిత విజయేంద్ర‌ప్ర‌సాద్ `మ‌హా భార‌తం` స్క్రిప్టు ప‌నులు మొద‌లెట్టేశారని తెలుస్తోంది.

    Also Read: Ugadi 2022 Special: ఉగాది పండుగ స్పెషల్-తెలుగు వారి ఆశలన్నీ ‘శ్రీ శుభకృత్’ పైనే

    నిజానికి మ‌హేష్ బాబు సినిమాను ఆరు నెలలు పోస్ట్ పొన్ చేసి మరీ రాజమౌళి మహాభారతం సినిమా స్క్రిప్ట్ పై కూర్చుంటున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ తెలుగు వాళ్లకు ఎలా అయితే, దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారో.. అచ్చం అలాగే భారతీయ పురాణ ఇతిహాసాలను ప్రపంచానికి ఒక తెలుగువాడిగా చాటి చెప్పాలని రాజమౌళి చిరకాల కోరిక అట.

    Tarak, Rajamouli

    గత కొన్ని సంవత్సరాలుగా రాజమౌళి మైండ్ సెట్ పూర్తిగా మారిందట. అయితే, తాజాగా రాజమౌళి గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మహాభారతానికి సంబంధించిన నలుగురి ప్రముఖుల రచనలను రాజమౌళి చదువుతున్నారట. రానున్న నాలుగైదు సంవత్సరాలలో మహాభారతం సిరీస్ ను అద్భుతంగా తెరకెక్కించాలని రాజమౌళి బాగా కోరికతో ఉన్నాడు.

    ఇక ఈ సిరీస్ లో జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించే అవకాశం ఉందట. ఒకటి కృష్ణుడు (తెలుగు వెర్షన్ కి మాత్రమే) మరొకటి కర్ణుడి పాత్ర (ఇది అన్నీ వర్షన్స్ లో). ఈ రెండు పాత్రల్లోని హెవీ ఎమోషన్ పండాలంటే తారక్ లాంటి ఈ తరం మహానటుడే పండించగలడు. మరి మహాభారతం ఏ సంవత్సరంలో మొదలవుతుందో చూడాలి.

    Also Read: Governor Tamilisai: గవర్నర్ కు షాక్: ఉగాది వేడుకకు హాజరు కాని సీఎం, మంత్రులు.. తగ్గేదేలే అంటున్న తమిళిసై

    Tags