God Father Crazy Update: మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ కాజోల్ కూడా నటించబోతుందని కొత్త పుకారు వినిపిస్తోంది. కళ్లతోనే మాయ చేసిన అందాల నటి కాజోల్. అందం, అభినయం కలబోసిన కాజోల్.. నిజంగా మెగాస్టార్ సినిమాలో నటిస్తోందా ?. నటిస్తే మాత్రం.. ఈ సినిమాకి ఫుల్ క్రేజ్ పెరిగినట్టే.

కాజోల్ కన్నులు కలువ పూలులా ఉంటాయి. ఆ కలువ కళ్లతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన కాజోల్.. డైరెక్ట్ తెలుగు సినిమా ఇంతవరకు చేయలేదు. ఆమె ‘గాడ్ ఫాదర్’లో నటిస్తే.. ఇదే మొదటి తెలుగు సినిమా అవుతుంది. ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ ఉన్న ‘కాజోల్’.. ప్రస్తుతం సినిమాలలో ఫుల్ యాక్టివ్ గా లేదు. అయితే అప్పుడప్పుడు మాత్రం కొన్ని హిందీ చిత్రాల్లో ఆమె నటిస్తోంది.
ఈ క్రమంలోనే కాజోల్ కు మెగా పిలుపు అందింది అని, కాబట్టి గాడ్ ఫాదర్ లో ఒక ప్రత్యేక పాత్రలో కాజోల్ కనిపించబోతుందని టాక్ నడుస్తోంది. అయితే కాజోల్ ఏ పాత్ర చేయబోతుంది ?, అసలు కాజోల్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయా ? లేక పక్కా ఎమోషనల్ పాత్రలో ‘కాజోల్’ కనిపించబోతుందా ? అనేది చూడాలి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే.. ఈ వార్త ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ లో మెగాస్టార్ లుక్ అదిరిపోయింది. స్పోర్ట్స్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో చిరంజీవి చాలా స్టైలిష్ గా కనిపించారు. ముఖ్యంగా స్టైల్ గా కుర్చీలో కూర్చొని, నలుపు షేడ్స్ లో కనిపించిన చిరు గెటప్ అండ్ సెటప్ వెరీ పవర్ ఫుల్ గా ఉంది. ఒక్క మాటలో చిరంజీవి పాత్రకు సంబందించిన ఈ లుక్ అద్భుతంగా ఉంది.
ఈ గాడ్ ఫాదర్ సినిమాలో మంచి ఎమోషన్స్ ను కూడా యాడ్ చేశారని.. అలాగే మెగాస్టార్ హీరోయిజమ్ ను కూడా బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది. అదే విధంగా ఈ సినిమా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
Recommended Videos