Mrunal Thakur: ఈ మధ్య కొందరు హీరోయిన్లు సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తున్నారు. సినిమాల్లో సాంప్రదాయంగా కనిపించినా.. పర్సనల్ గా మాత్రం మత్తెక్కించే విధంగా కనిపిస్తున్నారు. తాజాగా తెలుగుతో పాటు హిందీలో నటించిన ఓ భామ తన పర్సనల్ పిక్స్ ను సోషల్ మీడియాతో పంచుకుంది. తెలుగు నటించిన ఓ సినిమాలో ఎంతో సౌమ్యంగా కనిపించిన ఈ భామ ఫొటో షూట్ లో మాత్రం పిచ్చెక్కించే ఫొటోలతో కనిపించింది. అయితే ఈ పిక్స్ ను చూసి సాంప్రదాయవాదులు షాక్ అవుతున్నారు.
మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ కాలేజీ లో చదువుతుండగానే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ ప్లస్ లో వచ్చిన ‘కుచ్ కెహ్తీ.. యే ఖామోషియాన్’ లో మొదటిసారిగా నటించింది. ఆ తరువాత థ్రిల్లర్ సీరియల్ లో కనిపించింది. ఇలా గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఆ తరువాత 2014లో విడుదలైన మరాఠీ చిత్రం ‘విట్టి దండు’ అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె డాక్టర్ పాత్రతో అలరించింది. ఆ తరువాత పలు వెబ్ సిరీస్ లోనూ కనిపించింది.
2022లో తెలుగులో మొదటిసారిగా నాని నటించిన ‘జెర్సీ’ సినిమాలో కనిపించింది. ఆ తరువాత ‘సీతారామం’లో ఎంతో సౌమ్యంగా కనిపించి ఆకట్టుకుంది. అచ్చ తెలుగు అమ్మాయిలా మృణాల్ ఠాకూర్ ను చూసి ఫిదా అయ్యారు. అయితే ఆ తరువాత ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో మళ్లీ హిందీలో అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ భామ సోషల్ మీడియాలో రెచ్చిపోయింది.
తాజాగా ఈ భామ బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ అదరగొట్టింది. తన అందచందాలను ఆరబోస్తూ యూత్ ను ఇంప్రెస్ చేస్తోంది. ఎంతో సౌమ్యంగా కనిపించే మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా ఇలా కనిపించేసరికి సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ ఇంతలా రెచ్చిపోవడానికి కారణమేంటి? అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు తగ్గినా సోసల్ మీడియాలో మాత్రం చాలా మంది హీరోయిన్లు గ్లామర్ షో చేస్తున్నారు. అందులో భాగంగానే మృణాల్ ఠాకూర్ ఇలా దర్శనమిచ్చిందని అంటున్నారు.