Venkatesh multi starrer movie: వరుసగా రెండు రీజనల్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన తర్వాత టాలీవుడ్ లో అనిల్ రావిపూడి(Anil Ravipudi) రేంజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. ముఖ్యంగా సీనియర్ హీరోలు అనిల్ రావిపూడి ని అసలు వదలడం లేదు. వారిలో విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఒకరు. ఇప్పటి వరకు వెంకటేష్ తో మూడు సినిమా తీస్తే, మూడు కూడా మంచి కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆయన వెంకటేష్ తో నాల్గవ చిత్రం చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు అనిల్ రావిపూడి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ని తెరకెక్కిస్తాడేమో అని అంతా అనుకున్నారు, కానీ ప్రస్తుతానికి ఆ సినిమా సీక్వెల్ ని పక్కన పెట్టి, ఒక సరికొత బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయనున్నాడు అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది.
ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో హీరో కూడా స్క్రీన్ ని షేర్ చేసుకుంటాడట. ఈసారి F2 ,F3 తరహాలో మల్టీస్టార్రర్ మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో మరో హీరో పాత్ర కోసం తమిళ హీరో కార్తీ ని సంప్రదిస్తున్నారట. ఒకవేళ కార్తీ ఈ చిత్రం ఒప్పుకోకుంటే మలయాళం హీరో ఫహాద్ ఫాజిల్ ని ఎంచుకుంటారని టాక్. సాధ్యమైనంత వరకు కార్తీ ని తీసుకునేందుకే ప్రయత్నాలు చేస్తున్నాడట అనిల్ రావిపూడి. గతం లో కార్తీ అక్కినేని నాగార్జున తో కలిసి ‘మనం’ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం లో నాగార్జున, కార్తీ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. కేవలం నాగార్జున తోనే కాదు, కార్తీ ఏ హీరోతో కలిసి నటించినా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోతాది. అందుకే అనిల్ రావిపూడి కార్తీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కార్తీ ని సంప్రదించగా, స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకొనిరా, ఆలోచిద్దాం అని అన్నాడట.
వెంకటేష్ ఈ చిత్రం లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇప్పుడు కార్తీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే, ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రానుంది. అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతి బరిలో ఉందంటే, ఎవరైనా భయపడే పరిస్థితి వచ్చేసింది. ఈసారి కూడా సంక్రాంతి బరిలో చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కూడా ఉండొచ్చు. చూడాలి మరి ఈ సంక్రాంతికి కూడా అనిల్ రావిపూడి మరోసారి ఇండస్ట్రీ హిట్ ని అందుకుంటుందా లేదా అనేది.