Tollywood: టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త తరం భామల హడావుడి ఎక్కువ అయింది. ‘కేతిక శర్మ’ అనే మరో బ్యూటీ తెలుగు చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఏవరేజ్ హీరోల దగ్గర నుంచి చిన్నాచితకా హీరోల వరకూ అందరికీ మెయిన్ ఆప్షన్ కేతిక శర్మనే అయింది. ఒక్క హిట్ కూడా చేతిలో లేకుండానే.. కెరీర్ లో సడెన్ గా స్టార్ డమ్ సంపాదించి రోజురోజుకూ పైపైకి దూసుకుపోతోంది ఈ యంగ్ బ్యూటీ.

నిజానికి టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే, ఏకంగా రెండు సినిమాల్లో ఛాన్స్ లు అందుకోవడం అంటే.. అది సామాన్యమైన విషయం కాదు. కానీ కేతిక శర్మ ఆ ఘనతను ఘనంగా అందుకుంది. ప్రజెంట్ క్రేజీ హీరోయిన్స్ లో ఒకటిగా వెలిగిపోతుంది. అసలు మోడలింగ్ చేసే సయమంలోనే కేతిక శర్మ గ్లామర్ చూసి తక్కువ టైంలోనే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు.
కానీ, కాలం కలిసిరాలేదు. దీనికితోడు అమ్మడుకు బ్యాడ్ టైమ్ నడిచింది. ఎంత అందం ఉన్నా, ఎంతగా గ్లామర్ షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కేతిక శర్మకు సినిమా అవకాశాలు అంత తేలిగ్గా రాలేదు. ఎన్నో కష్టాలు అవమానాల తర్వాత ‘రొమాంటిక్’ అనే చిన్న సినిమా వచ్చింది. అయితే, ఎంతో కష్టపడి ఆ సినిమా పూర్తి చేసినా అది ఇంకా రిలీజ్ కి నోచుకోలేదు. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.
కాకపోతే, కేతిక శర్మకు డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అమ్మడు టాలీవుడ్(Tollywood) మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. అందుకే ఆమె ఖాతాలో మరో రెండు సినిమాలు చేరాయి. హీరో రామ్ తో పాటు నాని సరసన కూడా కేతిక శర్మ ఆడిపాడనుంది. ఈ భామకు వస్తోన్న ఆఫర్స్ చూస్తుంటే.. మరో రెండేళ్లలో స్టార్ హీరోయిన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి.
ఎలాగూ ఈ భామకు నటన విషయంలో మంచి మార్కులు వేశాడు పూరి జగన్నాధ్. ఇక గ్లామర్ విషయంలో నూటికి నూట యాభై మార్కులు సాధించింది కేతిక. అలాగే సూపర్ హాట్ క్యారెక్టర్స్ కు కేతిక పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. కాబట్టి.. తన హస్కీ హావభావాలతోనే యూత్ గుండెల్లో మంటలు పెట్టగలిగే నేర్పు ఉన్న కేతిక కచ్చితంగా కమర్షియల్ హీరోయిన్ గా చలామణి అవ్వడం ఖాయం.