Ashu Reddy: అషురెడ్డి సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా అవతరించింది. వరుస ఫోటో షూట్స్ తో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అషురెడ్డి స్కిన్ షో హద్దులు దాటేస్తుండగా… నెటిజెన్స్ బూతు కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వాళ్లకు అషురెడ్డి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తుంది. ఆ మధ్య అషురెడ్డి బట్టలను ఉద్దేశించి తిడుతున్న జనాలను చురకలు వేస్తూ ఓ రీల్ చేసింది. కామం మీ కళ్ళలో ఉంది. నా బట్టల్లో తప్పు లేదు, అంటూ ఇచ్చిపడేసింది. మీరు ఎంత విమర్శించినా నేను తగ్గేది లేదని చెప్పకనే చెప్పింది.
అషురెడ్డి తాజాగా షార్ట్ ఫ్రాక్ లో హాట్ సిట్టింగ్ ఫోజుల్లో మైండ్ బ్లాక్ చేసింది. పబ్లిక్ లో అషురెడ్డి తెగించింది. అషురెడ్డి ఫ్రాక్ బాగా చిన్నగా ఉంది. దీంతో ఫ్యాను గాలి తగిలిందా అషురెడ్డి పరువు గోవిందా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అషురెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. అషురెడ్డి సోషల్ మీడియా వేదికగా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఒకప్పుడు అషురెడ్డి అమెరికాలో ఉండేది. టిక్ టాక్ వీడియోలు చేస్తూ జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది.
అలా వచ్చిన ఫేమ్ ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ తెచ్చిపెట్టింది. సీజన్ 3 లో పాల్గొన్న అషురెడ్డి పెద్దగా ప్రభావం చూపలేదు. హౌస్లో అందాల ప్రదర్శన చేసినా ప్రేక్షకులు పట్టించుకోలేదు. అందుకే వీలైనంత త్వరగా ఇంటికి పంపించేశారు. అలాగే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషురెడ్డి పాల్గొన్నారు. అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. అయితే రావాల్సిన పాపులారిటీ తెచ్చుకుంది.
కొన్ని అడపాదడపా చిత్రాల్లో అషురెడ్డి నటించింది. ఆమె నటిస్తున్న కొన్ని ప్రాజెక్ట్ షూటింగ్ దశలో ఉన్నాయి. హీరోయిన్ కావాలనే లక్ష్యంతో అషురెడ్డి ముందుకు వెళుతుంది. అందులో భాగంగా సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తూ మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి రెండు బోల్డ్ ఇంటర్వ్యూలు చేశారు. అవి బాగా వైరల్ అయ్యాయి. ఈ ఇంటర్వ్యూల విషయంలో కూడా అషురెడ్డి విమర్శలు ఎదుర్కొంది.