Court : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. యంగ్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళకంటూ సపరేట్ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడానికి డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా రామ్ జగదీష్ తీసిన కోర్ట్ (Court) సినిమా మంచి విజయాన్ని సాధించింది. శివాజీ విలజాన్ని హైలైట్ చేస్తూనే ప్రియదర్శి న్యాయం కోసం పోరాటం చేస్తు ఉండటం లాంటి సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ కి కనెక్ట్ చేస్తూ రాసుకున్న స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అందువల్లే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. నిజానికి కోర్టు డ్రామా సినిమాలను తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆదరించరు. ఎందుకంటే అందులో నరేషన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇక ఎటు చూసినా కోర్టు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేక్షకుడికి కొత్తదనం అయితే ఏమీ అనిపించదని ఉద్దేశ్యంతో మన మేకర్స్ కోర్టు బ్యాక్ డ్రాప్ సినిమాలను పెద్దగా పట్టించుకోరు. ఒకప్పుడు చిరంజీవి హీరోగా వచ్చిన ‘అభిలాష’ (Abhilasha) సినిమా కోర్టు డ్రామాగా వచ్చి అందరిని ఇచ్చినప్పటికి అందులో రథం కోర్టు ఎపిసోడ్స్ ని చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది.
Also Read : ‘కోర్ట్’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఈ రేంజ్ లాభాలను నిర్మాత గా నాని కలలో కూడా ఊహించి ఉండదు!
ఇక తర్వాత బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయిన దామిని మూవీని తెలుగులో ఊర్మిళ అనే పేరుతో డబ్ చేశారు. అయినప్పటికి ఆ సినిమా తెలుగులో సూపర్ డిజాస్టర్ గా మిగిలింది. ఇక అనిల్ కపూర్ చేసిన ‘మేరీ జంగ్’ సినిమాని తెలుగులో విజృంభినగా శోభన్ బాబు చేశాడు. ఆ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. కానీ ప్రస్తుతం ప్రేక్షకుడి మైండ్ సెట్ అనేది మారిపోయింది.
కోర్టు డ్రామా సినిమాలకి కూడా తెలుగులో ఆదరణ పెరుగుతుంది. బాలీవుడ్, మలయాళం ఇండస్ట్రీలో కోర్టు డ్రామా సినిమాలకి ఎక్కువగా ఆధరణ అయితే ఉంటుంది. తెలుగులో కూడా అలాంటి ఒక ట్రెండ్ స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. దీనివల్ల చిన్న బడ్జెట్ లో కోర్టు డ్రామా సినిమాలు ఎక్కువగా రావడమే కాకుండా పెద్ద హీరోలు సైతం కోర్ట్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమాలు చేస్తే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తాయి.
తద్వారా పెద్ద హీరోలు కూడా అలాంటి కథలను ఎంచుకొని సినిమాలు చేయాలని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు… చూడాలి మరి ఇకమీదట ఇలాంటి కథలతో స్టార్ హీరోలు రంగుల్లోకి దిగుతారా లేదా అనేది…ఇప్పటికే పవన్ కళ్యాణ్(Pavan Kalyan) వకీల్ సాబ్ (Vakeel Sab) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. మరి ఇతర హీరోలు కూడా కోర్టు డ్రామాని నమ్ముకొని బరిలోకి దిగుతారా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…