Court Movie Trailer: హీరో గానే కాదు, నిర్మాతగా కూడా నాని సక్సెస్ అయ్యాడనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన నిర్మించిన సినిమాలన్నీ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. నాని(Natural Star Nani) నిర్మాణ సంస్థ నుండి ఒక సినిమా వస్తుందంటే, కచ్చితంగా అందులో మంచి విషయం ఉండే ఉంటుంది అనే నమ్మకం జనాల్లో కలిగింది. అందుకే ఆయన హీరో గా నటించే సినిమాలకు మాత్రమే కాకుండా, నిర్మాతగా వ్యవహరించే సినిమాలకు కూడా మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. రీసెంట్ గా ఆయన తన బ్యానర్ ‘వాల్ పోస్టర్ సినిమా’ పై ‘కోర్ట్'(Court Movie) అనే చిత్రం తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 14 న విడుదల అవ్వబోతున్న సందర్భంగా నేడు ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసారు మేకర్స్. ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read: ఛావా (తెలుగు) ఫుల్ మూవీ రివ్యూ…
ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకి అర్థం అయ్యింది ఏమిటంటే, హీరో మేజర్, హీరోయిన్ మైనర్. వీళ్లిద్దరు ప్రేమించుకుంటారు, ప్రేమ తర్వాత మరో లెవెల్ కి కూడా వెళ్తారు, దీనిని తీవ్రంగా వ్యతిరేకించే హీరోయిన్ తండ్రి, హీరో పై ఎన్ని కేసులు పెట్టాలో, అన్ని కేసులు పెడుతాడు, చివరికి పోక్సో చట్టం క్రింద కూడా కేసుని నమోదు చేయిస్తాడు. హీరో పట్ల అన్యాయం జరిగిపోతుంది. అతని తల్లిదండ్రులు ఒక లాయర్ ని సంప్రదిస్తారు. ఆ లాయర్ ఈ కేసు ని ఒప్పుకొని, నిందితుడిగా నిలబడిన హీరో తరుపున వాదించి, అతన్ని బయటకు ఎలా తీసుకొచ్చాడు అనేది స్టోరీ అని తెలుస్తుంది. హీరోగా హర్ష రోషన్ నటించగా, హీరోయిన్ గా శ్రీదేవి అనే అమ్మాయి నటించింది. ఇక హీరో తరుపున వాదించే లాయర్ గా ప్రియదర్శి నటించగా, సీనియర్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటించాడు.
అసలు ఈ చిత్రం లో శివాజీ ఉన్నాడు అనే విషయం ట్రైలర్ ని చూసేంత వరకు ఎవరికీ తెలియదు. చాలా కాలం తర్వాత ఆయన మంచి పవర్ ఫుల్ నెగటివ్ రోల్ లో ఈ చిత్రం ద్వారా ఆడియన్స్ కి కనిపించబోతున్నాడు. ట్రైలర్ ని చూస్తున్నంత సేపు చాలా ఆసక్తిగా అనిపించింది. కానీ ఇలాంటి కోర్ట్ డ్రామా సినిమాలకు స్క్రీన్ ప్లే జనరంజకంగా ఉండడం అత్యవసరం. చూస్తుంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం కోర్టు డ్రామాగానే అనిపిస్తుంది. ట్రైలర్ లో ఎమోషన్స్ ఉన్నాయి లవ్ స్టోరీ ఉంది, మంచి డ్రామా కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిర్మాతగా నాని కి మరో లాభదాయకమైన సినిమాగా ఈ చిత్రం నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.