Bigg Boss 6 Rohit and Marina: బిగ్ బాస్ హౌస్ లో కపుల్ రోహిత్, మెరీనా నాన్ స్టాప్ రొమాన్స్ కురిపిస్తున్నారు. కంటెంట్ కోసం కావాలనే కక్కుర్తి పడుతున్నారు. బిగ్ బాస్ కంట్లో పడాలంటే ముద్దులు, కౌగిలింతలే సరైన మార్గం అనుకుంటున్నారు. మొహమాటం మరచి అదే పనిలో ఉంటున్నారు. ఎంత భార్యాభర్తలైనా రొమాన్స్ కి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దులు ఈ జంట చెరిపేశారనిపిస్తుంది. మొదట్లో రోహిత్ భార్య మెరీనాకు ముద్దులు పెట్టడానికి, హగ్ చేసుకోవడనికి ఇష్టపడలేదు. దానికి ఆమె తెగ ఫీలైపోయింది. రొమాన్స్ చేయకపోయినా కనీసం మార్నింగ్ ఓ ఎనర్జీ హగ్ ఇవ్వవచ్చుగా అంది. దానికి కూడా నో అన్నాడు. కెమెరాల ముందు నా వల్ల కాదని ఓపెన్ గా చెప్పేశాడు.

అయితే ఈ సమస్యకు గత వారం నాగార్జున పరిష్కారం చూపించాడు. మెరీనా బాధను అర్థం చేసుకొని అందరి సమక్షంలో ఒక టైట్ హగ్ ఇప్పించాడు. మీరు భార్యాభర్తలు మీకు లైసెన్స్ ఉంది, రెచ్చిపోండని హామీ ఇచ్చాడు. మరి బిగ్ బాస్ ప్రేక్షకులకు కావలసిన మసాలా కూడా అదే అన్నట్లు నాగార్జున వాళ్ళను ప్రోత్సహించారు. అప్పటి నుండి ఈ జంట అసలు తగ్గడం లేదు. ప్రత్యేకంగా కెమెరాల ముందుకు వెళ్లి కావలసినంత రొమాంటిక్ కంటెంట్ ఇచ్చేస్తున్నారు.
తోటి కంటెస్టెంట్స్ కి మేము రొమాన్స్ చేసుకోవాలి పక్కకు పోండి అని నేరుగా చెప్పేస్తున్నారు. వీరి ముద్దులు, ముచ్చట్లు చూసిన నేహా చౌదరి ఒంటరితనం ఫీలయ్యారు. మిమ్మల్ని చూస్తుంటే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుందని చెప్పింది. సరే బయటికి వెళ్ళాక చేసుకుందువు గానీ, ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపో మాకు ఇబ్బందిగా ఉంది. మేము రొమాన్స్ చేసుకోవాలని మెరీనా పచ్చిగా చెప్పేసింది. ఇక చేసేది లేక వాళ్లకు ప్రైవసీ వదిలి నేహా అక్కడి నుండి వెళ్ళిపోయింది.

పైగా ఈ వారం ఎలిమినేషన్స్ లో ఈ జంట ఉన్నారు. దీంతో మరింత రెచ్చిపోతున్నారు అనిపిస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకులకు కావాల్సింది ఇచ్చేస్తే ఓట్లు పడినా పడకున్నా ఎలిమినేట్ చేయరని వీరు గట్టిగా నమ్ముతున్నారు. బిగ్ బాస్ తెలుగు మొదలయ్యాక ఎంట్రీ ఇచ్చిన రెండో కపుల్ రోహిత్-మెరీనా. గతంలో హీరో వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా షేరు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. సీజన్ 4 లో పాల్గొన్న వరుణ్-వితికా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వాళ్ళు తరచుగా గొడవలు పడేవారు. రొమాన్స్ యాంగిల్ చాలా తక్కువగా ఉండేది . ఈ మోడరన్ కపుల్ మాత్రం అసలు తగ్గడం లేదు.