చిత్ర పరిశ్రమకు వైరస్ కాటు..

కరోనా వైరస్ ప్రభావం అంతకంతకు పెరుగుతోంది. దాదాపు ప్రపంచం మొత్తాన్ని కబళించి వేస్తోంది. చివరికి చిత్ర పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక అధ్యయనం ప్రకారం ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమకు 2020లో సుమారు 3700 కోట్ల రూపాయల నష్టం ఎదురుకానుంది. ఇంతే కాదు కరోనా కారణంగా పెద్ద తారల చిత్రాల తేదీలు వాయిదా పడ్డాయి. జేమ్స్ బాండ్ చిత్రం కూడా 7 నెలల తర్వాత విడుదల కానుందని సమాచారం. కరోనా వైరస్ భయం […]

Written By: Neelambaram, Updated On : March 5, 2020 4:51 pm
Follow us on

కరోనా వైరస్ ప్రభావం అంతకంతకు పెరుగుతోంది. దాదాపు ప్రపంచం మొత్తాన్ని కబళించి వేస్తోంది. చివరికి చిత్ర పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతుంది. ఒక అధ్యయనం ప్రకారం ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిత్ర పరిశ్రమకు 2020లో సుమారు 3700 కోట్ల రూపాయల నష్టం ఎదురుకానుంది. ఇంతే కాదు కరోనా కారణంగా పెద్ద తారల చిత్రాల తేదీలు వాయిదా పడ్డాయి. జేమ్స్ బాండ్ చిత్రం కూడా 7 నెలల తర్వాత విడుదల కానుందని సమాచారం.

కరోనా వైరస్ భయం ప్రజలలో అణువణువునా నిండిపోయింది. చైనా, దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఇటలీలలో ఇప్పటికే బహిరంగ సభలను, పార్టీలను నిషేధించారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమ షాక్ నకు గురయ్యింది. మరోవైపు, కొరోనా వైరస్ వ్యాప్తి ఇంకా పెరిగితే తద్వారా చిత్ర పరిశ్రమకు ఎక్కువ నష్టం కలుగుతుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ కొరియా ఫిల్మ్ అసోసియేషన్ ప్రస్తుత పరిస్థితిని దుర్దశగా పేర్కొంది. 2015 లో దక్షిణ కొరియాలో ఇలాంటి ఒక వైరస్ కారణంగా పరిశ్రమ నష్టాలకు గురయ్యింది.

అయితే, ఆ సమయంలో పరిస్థితి ఇంత భయంకరంగా లేదు. ఆ సమయంలో థియేటర్లు ఓపెన్ అయ్యాయి.. మార్కెట్లు మూతపడలేదు. కానీ ప్రస్తుతమున్న కరోనా వైరస్ సినిమా వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. దక్షిణ కొరియాలోని అతిపెద్ద థియేటర్లలో ఒకటైన సిజివి పేర్కొన్న ప్రకారం చిత్రపరిశ్రమ గడ్డురోజులు ఎదుర్కోనుంది. మరోవైపు, ఇటలీలో ఇదే పరిస్థితి ఏర్పడింది. సగానికి పైగా థియేటర్లు అక్కడ మూతపడ్డాయి.కరోనా వైరస్‌ కారణంగా 100 మందికి పైగా మరణించారు. దింతో ప్రజలు భయపడుతున్నారు ఇంటినుండి బయటకు రావడం లేదు.

మరోవైపు, హాలీవుడ్ చిత్రాలు కూడా కరోనా బారిన పడ్డాయి. జేమ్స్ బాండ్ సిరీస్ ఫిల్మ్ డేట్ మరింత ముందుకు వెళ్ళింది. జేమ్స్ బాండ్ సిరీస్ గత ఆదాయాల రికార్డులను బద్దలు కొడుతుందని నిర్మాతలు నమ్ముతున్నారు. అయితే ఈ చిత్రం చైనాలో విడుదల కాకపోతే, పెద్ద నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు వారి ఆశలు అడియాసలయ్యాయి.