
ఇటీవల చిరంజీవి హీరోగా ప్రముఖ టాప్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ మూవీపై వచ్చిన వివాదం టాలీవుడ్ ను షేక్ చేసింది. ‘ఆచార్య’ కథ నాదేనంటూ ఒక దర్శకుడు ఆరోపించడం సినీ వర్గాల్లో కలకలం రేపింది. అయితే దీనిపై సీరియస్ అయిన కొరటాల శివ.. ఈ కథ నాదేనని.. అనవసరంగా అభాసుపాలు చేశారని దీనిపై కోర్టుకు సైతం ఎక్కాడు. నిజానికి టాలీవుడ్ మాత్రమే.. అన్ని సినిమా రంగాల్లో ఈ కథల దొంగలున్నారని పలువురు అంటున్నారు. కాపీ కొట్టి సినిమాలు తీస్తారని.. తక్కువ డబ్బులిచ్చి వారి క్రెడిట్ ను దోచుకుంటారనే విమర్శలున్నాయి.
Also Read: బాలయ్య కోసం వారణాసి ప్రయాణం !
సినిమా ఫీల్డ్ లో రాణించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఈ రంగంలో కేవలం ప్రతిభ ఉంటే చాలదు. పరిచయస్థులు కూడా ఉండాలని కొందరు అంటుంటారు. ముఖ్యంగా రచయితగా నిలదొక్కుకోవాలంటే ఎంతో ఓర్పు ఉండాలి. కొందరు రచయితలు తాము ఎంతో కష్టపడి రాసుకున్న కథలను కొందరు డైరెక్టర్స్ దొంగిలించారన్న ఆరోపణలు ఇది వరకు కూడా చేశారు.
కాగా ఈ క్రమంలోనే ప్రముఖ మాటల రచయిత బుర్ర సాయిమాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. తనకు ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. అయితే తన దగ్గరకు వచ్చే కొంత మంది మిత్రులు తమను డైరెక్టర్స్ మోసం చేశారని చెబితే చాలా బాధపడేవాన్నని చెప్పారు. కొంత మంది దర్శకులు కథను చెప్పమనగానే అవకాశం వచ్చిందన్న సంతోషంలో రచయితలు స్టోరీ చెబుతున్నారు. అయితే వీరు చెప్పిన కథలో నుంచి కొన్ని పాయింట్స్ తీసుకుని వేరే సినిమా లో వాడుకునే వారు ఎందరో ఉన్నట్లు సాయిమాధవ్ ఆరోపించారు. వీరిలో బడా దర్శకులు ఉండడం కలచివేస్తుందన్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: కరాటేకు పూర్వ వైభవం రావాలి: హీరో విశ్వక్ సేన్
సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని చూసిన యువ రచయితలు ఫీల్డుకు రావడం మానేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.అయితే రచయితలు తమ కథలను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ ఇబ్బంది నుంచి బయట పడే అవకాశం ఉంది. ఇందుకోసం రచయితల సంఘాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా రచయితల సంఘం అధ్యక్షుడిగా పరుచూరి బ్రదర్స్ ఉన్నారు. ఈ విషయంలో వారి చొరవ లేకుంటే రాను రాను రచయితలు కరువయ్యే ప్రమాదం ఉందని కొందరు వాపోతున్నారు.