Nara Rohit Interview: నందమూరి క్యాంప్ లో ప్రస్తుతం రెండు గ్రూపులు నడుస్తున్నాయి. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది వాస్తవం. ఒక క్యాంప్ నారా ఫ్యామిలీ కి మద్దతుగా ఉంటే, మరో క్యాంప్ జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) వైపు ఆయన అన్నయ్య కళ్యాణ్ రామ్(Kalyan Ram) తప్ప ఎవ్వరూ లేరు అనేది తెలిసిందే. ఒకప్పుడు సైలెంట్ వార్ లాగా వీళ్ళ మధ్య వ్యవహారాలు నడుస్తూ ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం నేరుగానే తమ అభిప్రాయాలను చెప్పేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుత రాజకీయాల గురించి అసలు ఏమి మాట్లాడడం లేదు, తన పని ఎదో తానూ చేసుకుంటూ వెళ్తున్నాడు. మరో పక్క కళ్యాణ్ రామ్ కూడా అంతే. ఇంత సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా టీడీపీ లో కొంతమంది నాయకులూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. రీసెంట్ గానే అనంతపురం ఎమ్మెల్యే ‘వార్ 2′(War2 Movie) చిత్రాన్ని ఆపేయాలంటూ వార్నింగ్స్ ఇస్తూ, ఎన్టీఆర్ తల్లిపై అత్యంత నీచమైన బాషని ఉపయోగించిన ఆడియో రికార్డు సోషల్ మీడియా లో ఎంత వైరల్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
Also Read: రోజురోజుకు పడిపోతున్న ‘కూలీ’ వసూళ్లు..6వ రోజు వచ్చింది ఎంతంటే!
దీని పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రౌండ్ లెవెల్ లో మండిపడ్డారు. ఇకపోతే రీసెంట్ గా నారా రోహిత్(Nara Rohit) కూడా ‘వార్ 2’ చిత్రం పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఆయన హీరో గా నటించిన ‘సుందరాకాండ’ చిత్రం మరో వారం రోజుల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రీసెంట్ గా విడుదలైన కూలీ, వార్ 2 చిత్రాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘కూలీ(Coolie Movie) చిత్రాన్ని చూశాను, అందులో కొన్ని బ్లాక్స్ చాలా బాగున్నాయి, ఓవరాల్ గా ఓకే పర్లేదు అనే రేంజ్ లో ఉంది. వార్ 2 చిత్రాన్ని నేను చూడలేదు, అంత ఆసక్తి కూడా లేదు. మా స్నేహితులు రెండిట్లో ఏ సినిమాని చూడొచ్చు అని అడిగితే కూలీ చిత్రాన్ని చూడమన్నారు’ అని చెప్పుకొచ్చాడు నారా రోహిత్.
Also Read: ‘వార్ 2’ కి వచ్చిన కలెక్షన్స్ లో మైనస్ షేర్స్..చరిత్రలో ఇదే తొలిసారి!
నారా రోహిత్ వ్యాఖ్యలను సోషల్ మీడియా లో నెటిజెన్స్ తప్పుబడుతున్నారు. రెండు చిత్రాలు థియేటర్స్ లో ప్రస్తుతం నడుస్తున్నాయి, విడుదల అయ్యి వారం రోజులు కూడా అవ్వలేదు, ఇలాంటి సమయం లో ఒక సెలబ్రిటీ హోదా లో ఉన్న వ్యక్తి ఒక సినిమా బాగుంది, ఒక సినిమా బాగాలేదు అనే అర్థం వచ్చేలా మాట్లాడొచ్చా..?, ‘వార్ 2’ చూడలేదా అంటే చూడలేదు, సమయం దొరికినప్పుడు చూస్తాను అని చెప్పుంటే సరిపోయేది కదా, ఇన్ని ఎందుకు మాట్లాడడం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా మాట్లాడడం వల్ల ఈ వీకెండ్ ‘వార్ 2’ చూద్దామని అనుకున్న వాళ్ళు నారా రోహిత్ వ్యాఖ్యలు చూసి సినిమా బాగలేదేమో అని ఆగిపోవచ్చు కదా, ఎందుకో నందమూరి క్యాంప్ లో నారా ఫ్యామిలీ కి సపోర్టుగా ఉండేవాళ్లంతా ఎన్టీఆర్ మీద పీకల దాకా కోపంతో ఉన్నారని తెలుస్తుంది
“Recently, I watched #Coolie and liked it in bits and pieces. Overall, it’s an okay film. I didn’t watch #War2 as my friends preferred Coolie.”
– #NaraRohit— Telugu Chitraalu (@CineChitraalu) August 20, 2025