Coolie Movie Trailer Release Date: ఆగష్టు 14 న విడుదల అవ్వబోతున్న సినిమాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘కూలీ'(Coolie Movie). తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రజనీకాంత్(Super star Rajinikanth) సినిమాలంటే మన టాలీవుడ్ లో మొదటి నుండి మంచి క్రేజ్ ఉంటుంది, అలాంటిది యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తే?, ఆ అంచనాలను ఊహించడానికి కూడా కష్టమే కదా?, ప్రస్తుతానికి కూలీ చిత్రానికి అదే జరుగుతుంది. ఈ సినిమాకి మన టాలీవుడ్ లో రికార్డు స్థాయి బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కూడా విలన్ క్యారక్టర్ చేయడంతో సినిమాపై మన టాలీవుడ్ లో క్రేజ్ ఇంకా ఎక్కువ పెరిగింది అనుకోవడం లో ఎలాంటి సందేహం లేదు.
Also Read: డేవిడ్ వార్నర్ కి అరుదైన బహుమతి అందించిన రాజమౌళి!
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించితిన్ థియేట్రికల్ ట్రైలర్ ఆగష్టు 2 న విడుదల చేయబోతున్నారు. దీనికి ఒక క్రేజీ పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ పోస్టర్ లో అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, సత్యరాజ్, శృతి హాసన్, ఉపేంద్ర, సౌభిన్ సహీర్ తదితరులు ఉంటారు. మధ్యలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ గా నడిచి వస్తుంటాడు. అయితే ఈ పోస్టర్ పై ఇప్పుడు పెద్ద ట్రోలింగ్ నడుస్తుంది. కారణం ఏమిటంటే ఇది ఇంగ్లీష్ చిత్రం ‘మాడ్ ఆమె వెబ్’ అనే పోస్టర్ ని మక్కీకి మక్కి దింపినట్టు ఉందట. లోకేష్ కనకరాజ్ లాంటి స్టార్ డైరెక్టర్ కి కూడా ఇలా కాపీ కొట్టే పరిస్థితి వచ్చిందా?, అయ్యో పాపం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎదో యాదృచ్చికంగా జరిగిందని అనుకోవడానికి కూడా లేదు, ఆ పోస్టర్ ని చూసే ఈ పోస్టర్ ని తయారు చేసినట్టు ఉంది.
Also Read: కమెడియన్ పద్మనాభం కొడుకు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కమెడియన్..ఎవరో గుర్తుపట్టగలరా?
ఇకపోతే ఈ చిత్రం లోని పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి లభించింది. మొదటి పాట పెద్దగా సౌండ్ చెయ్యలేదు కానీ, రెండవ పాట ‘మౌనిక’ మాత్రం యూత్ ఆడియన్స్ ని మెంటలెక్కిపోయేలా చేసింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పాటనే కనిపిస్తుంది. ఇది కదా అనిరుద్ మ్యాజిక్ అంటే అంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఈ పాటతో పాటు రీసెంట్ గా విడుదల చేసిన పవర్ హౌస్ పాటకు కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే హైప్ వేరే లెవెల్లో ఉంది. ఇప్పుడు ఈ రెండు పాటలతో ఆ హైప్ మరింత పెరిగింది. ఆగష్టు 2న విడుదల అవ్వబోయే ట్రైలర్ హిట్ అయితే ఇక పెరిగే అంచనాలను ఊహించడం ఎవరి తరం కాదు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.