Coolie movie Telugu rights : రజనీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనకరాజు (Lokesh Kanakaraju) దర్శకత్వంలో వస్తున్న కూలీ (Cooli) సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ని దక్కించుకోవడానికి రెండు పెద్ద సంస్థలు ఎదురుచూస్తున్నాయి. నాగార్జున ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఈ సినిమా రైట్స్ ను తీసుకోవాలని చూస్తున్నారు. అందుకే ఈ మూవీ రైట్స్ కోసం నాగార్జున విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వీళ్లతో పాటుగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వాళ్ళు ఈ సినిమా రైట్స్ ను తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రేట్స్ కోసం 40 నుంచి 45 కోట్ల వరకు డబ్బులను చెల్లించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు సంస్థల్లో ఏదో ఒక సంస్థ ఈ మూవీ రైట్స్ ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. లేదంటే రెండు కలిపి ఈ రైట్స్ ని దక్కించుకొని ఇద్దరు కలిసి రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా విషయంలో లోకేష్ కనక రాజు ఎక్కడ తగ్గకుండా భారీ ప్లానింగ్ తో సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. దాని వల్ల ఈ సినిమా కచ్చితంగా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే ధోరణి లో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. లోకేష్ ఏ విధంగా ఈ సినిమాని మలిచాడు. తద్వారా ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : ‘కూలీ’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనుగోలు చేసిన నాగార్జున!
రజినీకాంత్ ఇప్పటికే జైలర్ (Jailer) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ విజయాల పరంపరను కొనసాగించడానికి లోకేష్ కూడా చాలావరకు హెల్ప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత జైలర్ 2 సినిమాతో మరోసారి తను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో మరోసారి రజనీకాంత్ భారీ గుర్తింపును సంపాదించుకోవాల్సిన అవసరమైతే ఉంది…రజినీకాంత్ లాంటి నటుడు చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది… ఇక ఈ ఏజ్ లో కూడా ఆయన ఎక్కడ కనబడకుండా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…