Coolie Vs War 2: వన్ సైడ్ డామినేషన్ అనే పదం మీరు చాలా సార్లు విని ఉంటారు. ఇది ఎక్కువగా సినిమాల విషయం లో ఉపయోగిస్తూ ఉంటారు. ఎల్లుండి పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన రెండు సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. ఒకటి ‘కూలీ'(Coolie Movie), మరొకటి ‘వార్ 2′(War 2 Movie). ఈ రెండు సినిమాల్లో అమెరికా నుండి అనకాపల్లి వరకు ‘కూలీ’ చిత్రం ‘వార్ 2’ పై వన్ సైడ్ డామినేషన్ చూపిస్తూ ముందుకు పోతుంది. రెండు సినిమాల మధ్య అసలు పోటీనే లేదు. తొక్కుకుంటూ పోవడమే అని #RRR లో ఎన్టీఆర్(Junior NTR) డైలాగ్ ఉంటుంది చూసారా?, అలాంటి పరిస్థితినే కనిపిస్తుంది. ఎంతైనా ఎన్టీఆర్ మన తెలుగు లోని టాప్ 6 స్టార్ హీరోలలో ఒకరు. ఆయన సినిమాలకు మొదటి రోజు బుకింగ్స్ ఎలా ఉంటాయో మనం ‘దేవర’ చిత్రానికి చూశాము.
Also Read: కెరియర్ మొదట్లో మోహన్ బాబు చేతిలో దెబ్బలు తిన్న నాని…అసలేం జరిగిందంటే..?
అలాంటి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ ని చూపించిన సినిమా తర్వాత విడుదలైన ‘వార్ 2’ చిత్రం ఒక తమిళ చిత్రం ముందు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా డామినేట్ అవుతుందని పాపం నందమూరి అభిమానులు ఎప్పుడూ ఊహించి ఉండరు. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఆడియన్స్ లో నిజమైన హైప్,క్రేజ్ ని ఏర్పాటు చేసే ప్రమోషనల్ కంటెంట్ ఉండాలి. లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా ఇంతే పరిస్థితి. రీసెంట్ గా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ఓపెనింగ్స్ కూడా చూశాము. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పుడూ చూడనంత డిజాస్టర్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి దక్కాయి. ఈ సినిమాకి అయితే మరీ దారుణం, విడుదలకు ముందే ఆడియన్స్ కి డిజాస్టర్ సినిమా అని అర్థం అయిపోయింది. ప్రమోషనల్ కంటెంట్ యావరేజ్ గా ఉన్నా థియేటర్స్ కి కదలని ఆడియన్స్ ఉన్న ఈరోజుల్లో, ఇలాంటి కంటెంట్ ఉంటే ని వదిలితే ఎలా చూస్తారు చెప్పండి. కనీసం టాక్ వచ్చినా మంచి వసూళ్లను రాబట్టి ఉండేది, ప్రీమియర్ షోస్ నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక కనపడకుండా పోయింది. ఇప్పుడు ‘వార్ 2’ చిత్రానికి కూడా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ రావాలి, లేదంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి పట్టిన పరిస్థితే ఈ సినిమాకు కూడా పడుతుంది.