Coolie 4 Days Collections: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinkanth) లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రజినీకాంత్, లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ అంటే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి, వాటిని అందుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు, అందుకే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది కానీ, సినిమా మాత్రం చాలా డీసెంట్ గా ఉందని, ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఇందులో ఉన్నాయని అంటున్నారు. అందుకే ఆన్లైన్ లో వచ్చే రివ్యూస్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్ వీకెండ్ దంచి కొట్టేసింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 397 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. కానీ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇది ఏ మాత్రం సరిపోదని అంటున్నారు.
ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని చేరాలంటే కచ్చితంగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాల్సి ఉంటుంది. ఈ వీకెండ్ తో 500 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశం ఉంది. అంతకు మించి వసూళ్లను రాబడుతుందా లేదా అనేది చూడాలి. తమిళనాడు ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం లాగానే అనిపిస్తుంది. అంటే కేవలం తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి అన్నమాట. ఇప్పటి వరకు తమిళనాడు నుండి 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ మొత్తం బలమైన హోల్డ్ ని కొనసాగిస్తే కానీ టార్గెట్ చేరుకోవడం కష్టం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ వీకెండ్ తోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో 46 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి, ఇప్పటి వరకు 38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నిన్న వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కారణంగా తగ్గాయి, లేకపోతే 40 కోట్ల షేర్ మార్కుని అందుకునే అవకాశం ఉండేది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రం ఈ వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ ని దాటేస్తుంది. ఇక ఓవర్సీస్ లో అయితే దాదాపుగా బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వచ్చేసింది. అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రం నిన్నటి వరకు నార్త్ అమెరికా లోనే 6.5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మరో మూడు రోజుల్లో ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఓవరాల్ గా అయితే ఈ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని ఓవర్సీస్ లో కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక్క కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో మాత్రమే నష్టాలు వస్తాయని అంచనా వేస్తున్నారు, చూడాలి మరి.