Bigg Boss 7 Telugu First Finalist : బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ఇక కేవలం మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. కాగా కంటెస్టెంట్స్ కి హౌస్ లో మొదటి ఫైనలిస్ట్ అయ్యేందుకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఫినాలే అస్త్ర సాదించేందుకు టాస్క్ లు నిర్వహించారు బిగ్ బాస్. మొదటగా వీల్ ఛాలెంజ్ లో ఒక్కొక్కరిగా అందరూ అవుట్ అయిపోయారు.ఇక చివరికి ప్రియాంక, అర్జున్ రేస్ లో నిలిచారు. ప్రియాంక .. అర్జున్ కి గట్టి పోటీ ఇచ్చింది. కానీ టాస్క్ మాత్రం అర్జున్ గెలిచాడు.
తర్వాత రెండో రౌండ్ లో పూలు సేకరించాలి అంటూ టాస్క్ ఇచ్చారు. ఇందులో ప్రశాంత్ విన్ అయినట్లు తెలుస్తుంది. ఇక మూడో రౌండ్ లో మరో టాస్క్ నిర్వహించగా .. అర్జున్ విజయం సాధించాడని సమాచారం. దీంతో రెండు టాస్క్ లు గెలిచి 200 పాయింట్స్ తో ఫినాలే అస్త్ర సాధించాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా అర్జున్ టికెట్ టూ ఫినాలే సాధించినప్పటికీ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాడు.
ఈ వారం కచ్చితంగా అర్జున్ ఎలిమినేట్ అవుతాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి అర్జున్ చేతులారా నెగిటివ్ చేసుకున్నాడు. అమర్ కెప్టెన్సీ విషయంలో శివాజీ కి నెగిటివిటీ వచ్చిందంటే .. అందుకు ముఖ్య కారణం అర్జున్. అతని కోసం స్టాండ్ తీసుకుని శివాజీ ప్రేక్షకుల దృష్టిలో చిన్నపాటి విలన్ అయిపోయాడు. అంత నెగిటివిటి తెచ్చుకుని .. నాగార్జున తో తిట్లు తిన్నాడు శివాజీ.
కాగా నిన్నటి నామినేషన్స్ లో శివాజీకి వెన్నుపోటు పొడిచాడు అర్జున్. తన కోసం అంత చేసిన శివాజీని నామినేట్ చేశాడు. దీంతో శివాజీ రియాక్ట్ అయిన తీరు ఎమోషనల్ గా అనిపించింది. అర్జున్ చేసిన పని శివాజీ తో పాటు ఆడియన్స్ కూడా జీర్ణించుకోలేక పోయారు. అందుకే ఈ వారం అర్జున్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. అతి తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉన్నాడు. ఓటింగ్ ప్రక్రియ మొదలై రెండు రోజులు మాత్రమే అయింది. కాబట్టి ఇందులో మార్పు జరగొచ్చు. చూడాలి మరి ఏం జరగనుందో.